Keerthy Suresh మెరుపు తీగలా మారిన కీర్తీ సురేష్.. క్రేజీ డైరెక్టర్‌తో మహానటి కలిసి..

దక్షిణాదిలో గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో అద్భుతమైన ప్రతిభను చాటుకొన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నట వారసత్వాన్ని, సినీ నేపథ్య కుటుంబం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించారు. అయితే చిన్న చిన్న పాత్రలతో ఆలరిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. తాజాగా ఆమె నటించిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజిలా మారింది. మెరుపు తీగల మారిన కీర్తీ సురేష్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

నిర్మాతలకు లక్కీ హీరోయిన్‌గా

నిర్మాతలకు లక్కీ హీరోయిన్‌గా

మలయాళ చిత్రం పైలెట్స్‌తో కీర్తీ సురేష్ బాలనటిగా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత నేను శైలజ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరసు ఆఫర్లు రావడంతో అగ్ర హీరోయిన్‌గా, నిర్మాతలకు లక్కీ హీరోయిన్‌గా మారిపోయారు. నేను లోకల్ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకొన్నది.

మహానటి తర్వాత మరింత క్రేజ్‌తో

మహానటి తర్వాత మరింత క్రేజ్‌తో

ఇక సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో అవార్డులతోపాటు రివార్డులు కూడా అందుకొన్నారు. మహానటి చిత్రంతో ఆమెపై క్రేజ్ మరింత పెరిగింది. అనంతరం సర్కార్, మన్మథుడు చిత్రాలతో ఆలరించింది. పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి చిత్రాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో మెప్పించింది.

చిరంజీవి, మహేష్ బాబు చిత్రాల్లో

చిరంజీవి, మహేష్ బాబు చిత్రాల్లో


కీర్తీ సురేష్ ఇటీవల రంగ్ దే, అన్నాతే, మరక్కార్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారీ పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాల్లో నటించబోతున్నది. అంతేకాకుండా మలయాళంలో వాషి, తమిళంలో సాని కాయిధామ్ చిత్రాలతోపాటు నానితో కలిసి దసరా అనే సినిమాలో విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నది.

జనవరి 28న గుడ్ లక్ సఖీ మూవీతో

జనవరి 28న గుడ్ లక్ సఖీ మూవీతో


ఇదిలా ఉండగా, కీర్తీ సురేష్ నటించిన గుడ్ లక్ సఖీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కరోనావైరస్ పరిస్థితుల్లో పలు సినిమాలు వాయిదా పడటం తెలిసిందే. కానీ జనవరి 28వ తేదీన కీర్తీ సురేష్ కీలక పాత్ర పోషించిన గుడ్ లక్ సఖీ అనే చిత్రం రిలీజ్ కానున్నది. ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూరు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తుండగా, సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తే.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫిని అందించారు.

గుడ్ లక్ సఖీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

గుడ్ లక్ సఖీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు
దర్శకత్వం: నగేష్ కుకునూర్
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
సహ నిర్మాత: శ్రావ్య వర్మ
మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: చిరంతన్ దాస్
బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2022-07-28

Recommended Video

Actress Priyamani Exclusive Interview About Narappa Movie | Filmibeat Telugu
కీర్తీ సురేష్ కెరీర్

కీర్తీ సురేష్ కెరీర్


కీర్తీ సురేష్ కెరీర్ విషయానికి వస్తే.. రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తున్న అన్నాతే చిత్రంలో నటించారు. ప్రస్తుతం విజయ్‌తో బీస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్‌తో సర్కార్ చిత్రంలో కీర్తీ సురేష్ నటించిన సంగతి తెలిసిందే. అలాగే సెల్వరాఘవన్‌తో సానీ కాయిధమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X