మహానటికి స్టార్ హీరో షాక్ ఇవ్వబోతున్నాడా.. మంచి ఆఫర్ పోయినట్లేనా?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాలకు స్టార్ హీరోయిన్స్ కరువయ్యారనే చెప్పాలి. ఒకసారి నటించిన హీరోయిన్ తో మరోసారి నటించడానికి కొందరు స్టార్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. పైగా ఆడియెన్స్ కి కూడా చాలా కాలంగా సీనియర్లను చూసి కాస్త బోర్ కొట్టేసిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ లాంటి బ్యూటీలకు మంచి డిమాండ్ పెరిగే ఛాన్స్ వచ్చింది.

కానీ కీర్తి సురేష్, అనుకున్నంతగా పెద్ద సినిమాల్లో అయితే ఛాన్స్ లు దక్కించుకోవడం లేదు. ఆ మధ్య మైదాన్ అనే బాలీవుడ్ ఆఫర్ వచ్చినప్పటికీ ఎందుకో రిజెక్ట్ చేసింది. ఇక తెలుగులో చాలా కాలం తరువాత మహేష్ బాబుతో ఒక సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాటలో కీర్తిని ఫైనల్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను మార్చుకున్నట్లు టాక్ వస్తోంది.

Keerthy suresh Sarkaru vaari paata offer lost in last minute

ఎందుకంటే ఆమె స్టైల్ ఇప్పుడు మారిపోయింది. జీరో సైజ్ మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేసి కీర్తి లావు తగ్గింది. కానీ ఆమె సన్నబడటం కొందరికి నచ్చడం లేదు. మరీ అంత బక్కగా అవ్వడం ఏ మాత్రం బాగోలేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. ఇక త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ కానున్న తరుణంలో ఆ బ్యూటీపై చిత్ర యూనిట్ ఇంట్రెస్ట్ చూపడం లేదని టాక్ వస్తోంది. మరొకరిని సెలెక్ట్ చేసుకోవాలని నిర్మాతలు కూడా సలహా ఇచ్చినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కీర్తి సురేష్ మాత్రం ఒక మంచి ఆఫర్ మిస్ చేసుకోబోతుందనే రూమర్స్ కోలీవుడ్ లో కూడా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X