12వ తరగతిలోనే ప్రేమ. 15 ఏళ్ల రిలేషన్.. ఆ సమయంలోనే పెళ్లి ఆలోచన..
Keerthy Suresh Love Story: గతేడాది ఎంతోమంది సెలబ్రిటీలు తమ ఇష్టమైన వారితో ఒకటయ్యారు. తమ ప్రేమను మూడు ముళ్లలబంధంగా మార్చుకున్నారు. అలా.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంటలలో హీరోయిన్ కీర్తి సురేష్- అంటోని తటిల్ ఒకరు. కీర్తి తన లవర్ ఆంటోనీ తటిల్ తో కలిసి తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి, మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుక ఇటు హిందూ సాంప్రదాయబద్దంగా.. అటు క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. అయితే తాజాగా కీర్తి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ పెళ్లి వివాహం సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని అమ్మడు. ఈ ముద్దుగుమ్మ 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది . తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. అలాగే.. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. తెరకెక్కించిన బయోపిక్ 'మహానటి' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా తో కీర్తి సురేష్ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

ఇదిలా ఉంటే.. హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు, తన ప్రియుడు ఆంటోనీ తటిల్ తో కలిసి ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ మాట్లాడుతూ .. తాను 12వ తరగతిలోనే ఆంటోనీతో ప్రేమలో పడ్డానని, తమ ప్రేమకు 15 ఏండ్లు అని పేర్కొన్నారు. తామిద్దరం చాలా రోజులు సరదాగా గడపామని, ఒకసారి తాను తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లామని, అక్కడికి ఆంటోనీ కూడా వచ్చాడని చెప్పింది. అయితే ఆంటోనీ తనకు స్కూల్ మెట్ అని, ఆ పరిచయంతో పిలవగానే తన దగ్గరికి వెళ్ళానని చెప్పింది. ధైర్యం ఉంటే తనకు ప్రపోజ్ చేయమని తానే ఛాలెంజ్ చేశానని, అలా 2010లో ఆంటోనీ తనకు మొదటిసారిగా ప్రపోజ్ చేశాడని కీర్తి చెప్పింది.
చాలా రోజులు తాము స్నేహితులుగానే ఉన్నామని, 2016 నుండి తమ బంధం మరింత బలపడిందని, ఆ సమయంలో ఆంటోనీ తనకు రింగును బహుమతిగా ఇచ్చాడని చెప్పింది. ఆ ఉంగరాన్ని తాను పెళ్లి చేసుకునేంతవరకు తీయలేదని, కావాలంటే తాను నటించిన ప్రతి సినిమాలో ఆ ఉంగరాన్ని చూడవచ్చు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. కీర్తి సురేష్ ఇంకా మాట్లాడుతూ.. తమ పెళ్లి ఇప్పటికీ కలగానే ఉందని, తన హృదయం భావోద్వేగంతో నిండి పోయిందని, తామిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నామని చెప్పుకొచ్చింది. తామిద్దరం 12వ తరగతి నుండి ప్రేమించుకుంటున్నామని, ఆంటోనీ తన కంటే ఏడు సంవత్సరాలు పెద్దవాడని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది.

ఆంటోనీ కెరీర్ గురించి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా కత్తర్ లో వర్క్ చేస్తున్నాడని, తన కెరియర్ కు ఆంటోనీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాడని, అతడు తన జీవిత భాగస్వామిగా రావడం తన అదృష్టమని భావోద్వేగానికి లోనైంది కీర్తి సురేష్. వాస్తవానికి తమ పెళ్లి ఫిక్స్ అయిన తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గానే ఉంచుదామని నిర్ణయించుకున్నామని, తమ ప్రేమ వ్యవహారం అత్యంత సన్నిహితులైన స్నేహితులకు మాత్రమే తెలుసన్నారు. ఇండస్ట్రీలో కూడా సమంత, విజయ్ , అట్లీ, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి లాంటి కొంతమందికి మాత్రమే తమ లవ్ మ్యాటర్ తెలుసునని అని కీర్తి సురేష్ చెప్పారు.
వాస్తవానికి తామిద్దరం వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుకోవాలని భావిస్తామని, అందుకే ఎన్నడూ కూడా మీడియా కంట పడలేదని తెలిపింది. మొదటిసారి 2017లో తామిద్దరం కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లామని, 2022లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నామని, అలా 2024 డిసెంబర్లో ఒకటయ్యామని చెప్పుకొచ్చింది కీర్తి. అలాగే పసుపు తాడుతో కనిపించడంపై కీర్తి క్లారిటీ ఇస్తూ.. వస్తాడు అనేది చాలా పవిత్రమైనదని శక్తివంతమైనదని, మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసుగా మార్చుకుంటానని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











