మిస్టీరియస్ మ్యాన్‌తో సన్నిహితంగా కీర్తీ సురేష్.. బాయ్‌ఫ్రెండ్ అంటూ అనుమానాలు!
మహానటి సినిమా తర్వాత కీర్తీ సురేష్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రజినీకాంత్, మహేష్ బాబు, నానీ లాంటి స్టార్ హీరోలతోపాటు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన దసరా చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. అదే జోష్‌తో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నది.
అయితే ఇటీవల కాలంలో కీర్తీ సురేష్ అఫైర్, బాయ్ ఫ్రెండ్ వ్యవహారం చర్చనీయాంశవుతున్నది. దాంతో ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ ఫోటో అనేక అనుమానాలు సృష్టించింది. ఓ యువకుడితో చెట్టాపట్టాల్ వేసుకోవడంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇంతకు షేర్ చేసిన ఫోటో కీర్తీ సురేష్ బాయ్‌ఫ్రెండ్‌దా అనే వివరాల్లోకి వెళితే..

కొద్దికాలంగా కీర్తీ సురేష్ తన తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకొంటుందని వార్తలు వినిపించాయి. అదే సమయంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో రావడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో ఆమె అఫైర్, పెళ్లి వార్త గందరగోళంగా మారింది. ఇలాంటి సమయంలో ఒకే కలర్ డ్రస్ వేసుకొని ఫోటోలకు ఫోజివ్వడంతో అతడేనా ఆమె బాయ్‌ఫ్రెండ్ అనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
అయితే కీర్తీ సురేష్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన వ్యక్తి పేరు. ఫర్హాన్ బిన్ లియాకత్. అతడు కీర్తీ సురేష్ చిన్ననాటి స్నేహితుడు. ఫర్హాన్ బర్త్ డేను పురస్కరించుకొని ఆమె హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. ఈ సంవత్సరం నీకు మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నాను అంటూ కామెంట్ చేసింది. దాంతో ఫర్హాన్ కూడా థ్యాంక్యూ కిట్టీ అంటూ సమాధానం ఇచ్చారు.
ఫర్హాన్, కీర్తీ సురేష్ మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. ఫర్హాన్ ఆమె బాయ్‌ఫ్రెండ్ కాదని తేలిపోవడంతో ఫ్యాన్స్ సంబరపడిపోయారు. వారిద్దరి స్నేహం గురించి నెటిజన్లు మంచి కామెంట్లు పాస్ చేస్తున్నారు.
కీర్తీ సురేష్ కెరీర్ విషయానికి వస్తే.. మామన్నన్, సైరన్ చిత్రాల్లో నటిస్తున్నది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ రివాల్వర్ రీటా, రఘు తాత, చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె నటించిన భోళాశంకర్ చిత్రం త్వరలోనే రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











