Just In
- 25 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 46 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గర్భవతి అయిన కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్
ఆ నాటి మహానటి సావిత్రి అయితే.. ఈ నాటి మహానటి కీర్తి సురేష్. ఇటీవలే నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న ఈమె పుట్టినరోజు ఈ రోజు (అక్టోబర్ 17). ఈ సందర్బంగా ఈమె నటిస్తున్న సినిమాల తాలూకు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి కీర్తి ఫాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
తెలుగు పాటు తమిళ భాషా చిత్రాల్లో సత్తా చాటుతూ వస్తున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం తమిళంలో 'పెంగ్విన్' సినిమా చేస్తోంది. విలక్షణ కథాంశంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టోన్ బెంచ్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కీర్తి సురేశ్ పాత్ర చుట్టూనే తిరిగేలా ఈ సినిమా కథ సిద్ధం చేసి దానికి తెర రూపమిస్తున్నాడట డైరెక్టర్. కాగా ఈ రోజు కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్బంగా 'పెంగ్విన్' సినిమా నుంచి ఆమె లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ లుక్‌లో కీర్తి సురేష్ గర్భవతిగా కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ లుక్ చూడగానే అట్రాక్ట్ అయ్యారు ఆడియన్స్. ఈ సినిమాలో కీర్తి చేస్తున్న పాత్రలో కొత్తదనం చూడొచ్చని, ఆమె కెరియర్లో ఈ సినిమా ఓ మైలురాయి కావడంఖాయం అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుండటం విశేషం. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. చూడాలి మరి.. ఈ విలక్షణ పాత్ర కీర్తి సురేష్ కెరీర్‌కి ఎంతవరకు ప్లస్ కానుందనేది.