Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Keerthy Suresh: ఆ సినిమా కోసం మహానటి షాకింగ్ రెమ్యునరేషన్.. అందరికంటే ఎక్కువగానే..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు అందుకుంటున్న కీర్తి సురేష్ ఈటీవల కాలంలో పలు కమర్షియల్ సినిమాలు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాకుండా గ్లామరస్ పాత్రల్లో కూడా నటించేందుకు ఈ బ్యూటీ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అలాగే పాత్ర నచ్చి డిమాండ్ చేస్తే ఎలా అయినా నటిస్తాను అని చెబుతోంది. ఇక రాబోయే ఒక సినిమాలో మహానటి కాస్త డీగ్లామర్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా కోసం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమల అందరి హీరోయిన్ల కంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

లేడి ఓరియెంటెడ్ సినిమాలు
మహానటి సినిమాతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత రెగ్యులర్ హీరోయిన్ గా మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహాలు చాలానే వచ్చాయి. కానీ ఆమె ఆ ఫీవర్ ను జనాలు మరిచిపోయే వరకు కాస్త ఓపిక పట్టింది అని చెప్పాలి. సావిత్రి బయోపిక్ లో నటించిన తర్వాత వెంటనే ఆమె గ్లామరస్ పాత్రలో చేయకుండా కాస్త లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసి మళ్లీ ఇప్పుడు అగ్ర హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తోంది.

మహేష్ సినిమా కూడా
ఒక విధంగా మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇటీవల వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.

చిన్న బడ్జెట్ లో ఉంటే..
ఇక కీర్తి సురేష్ ఒక సినిమాకు ఎంత పారితోషికం అందుకుంటుంది అనే విషయంలో అనేక రకాల కథనాలు వైరల్ గా మారుతున్నాయి. కీర్తి సురేష్ కంటెంట్ నచ్చితే ఒకవేళ బడ్జెట్ తక్కువగా ఉంటే మాత్రం ముందు పారితోషికం తీసుకోకుండా లాభాలు వచ్చిన తర్వాత షేర్ తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు ఒప్పుకుందట. నష్టాలు వస్తే కూడా ఆమె నిర్మతలను ఆ తర్వాత డబ్బులు కూడా అడగలేదు అని తమిళం చిత్ర పరిశ్రమలో ఒక టాక్ వినిపించింది.

అత్యధిక బడ్జెట్
ముందు పాత్ర నచ్చితేనే సినిమాలు చేసేందుకు కీర్తి సురేష్ ఒప్పుకుంటుంది అని ఇండస్ట్రీలో ఒక మంచి నమ్మకం అయితే ఉంది. ఇక నాని నటిస్తున్న దసరా సినిమా కోసం ఆమె పాత్ర డిమాండ్ ను బట్టి భారీ స్థాయిలోనే పారితోషికం అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. నాని సినిమా కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందిస్తున్నారు.

సాలీడ్ రెమ్యునరేషన్
దసరా సినిమాలో కీర్తి సురేష్ కంప్లీట్ గా గ్లామర్ పక్కన పెట్టేసి ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయిల డిగ్లామర్ పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆ పాత్ర కోసం ఆమె దాదాపు మూడు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు కూడా ఆమె డిమాండ్ ను బట్టి పెద్దగా చర్చలు లేకుండానే అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో కీర్తి సురేష్ ఒకరని చెప్పవచ్చు.