twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కీర్తి సురేష్, వివరాలు ఇవే...

    |

    తెలుగు, తమిళంలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతున్న చెన్నై బ్యూటీ కీర్తి సురేష్ త్వరలో హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

    హిందీలో 'బదాయి హో' లాంటి కల్ట్ హిట్ చిత్రాలు అందించిన అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్నారు.

    Keerthy Suresh signs a Ajay Devgan film

    ప్రస్తుత కాలానికి సంబంధించిన కథతో... ఈ తరం రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి? అనే ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. త్వరలో మూవీకి సంబంధించి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

    2018 సంవత్సరంలో కీర్తి సురేష్ రికార్డు స్థాయిలో 8 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 'మారక్కర్' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. అజయ్ దేవగన్ సినిమా వర్కౌట్ అయితే బాలీవుడ్ ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉందట.

    English summary
    Keerthy Suresh entering into Bollywood in a big way and will star with none other than Ajay Devgan. Amit Sharma will directs this film. The film will be produced by Boney Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X