చెమటలు పట్టేలా కీర్తి సురేష్ హాట్ వీడియో.. ఆసనాలు వేస్తూనే లెగ్స్ అందాల ప్రదర్శన
చిన్నతనంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, హీరోయిన్ గా అలరిస్తుంటారు కొంతమంది. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో కథానాయికగా డెబ్యూ చేసింది. అక్కడ హీరోయిన్ గా హిట్ కొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించింది. అనంతరం తెలుగు ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. ఇలా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ అందిస్తోంది. తాజాగా ఆమె వీడియో వైరల్ అవుతోంది.
మహానటిగా :మహానటి మూవీతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది మలయాళీ బొద్దుగుమ్మ కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసింది కీర్తి సురేష్. మొదటి సినిమాలో తనదైన నట, హావా భావాలతో ఆకట్టుకున్న ఈ భామ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీతో మహానటి అని పేరు తెచ్చుకుంది.

ఫలితాలు తారుమారు: మహానటి తర్వాత సినిమాల్లో గ్లామర్‌కు ఏమాత్రం తావివ్వకుండా సినిమాలు చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. అయితే ఆ సినిమాలన్ని అనుకున్నంతగా ఆకట్టుకోలేవు. రిజల్ట్ ఎలా ఉన్న తను మాత్రం హోమ్లీగా, బబ్లీగానే కనిపిస్తూ వచ్చింది. అంతేకాకుండా మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ సినిమాలు ఫలితాలు కూడా తారుమారు అయ్యాయి.

ప్రైవేట్ ఆల్బమ్: ఇక గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఇక ఇదంతా కాదని, సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. మంచి కలెక్షన్లు రాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ అకౌంట్లో ఓ హిట్ ఉండేలా చేసింది.

గ్లామర్ డోస్ పెంచి : అయితే సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ పోషించిన కళావతి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో ఎన్నడూ చూడని విధంగా కీర్తి సురేష్‌ను చూడటంతో కొందరు బాగుందని పొగడగా, మరికొందరు పాత కీర్తి సురేష్ ముద్దుగా ఉందని భావించారు. ఇక ఇప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ కాస్తా స్లిమ్ అయి.. గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.

సినిమాల లిస్ట్: సర్కారు వారి పాట తర్వాత మళ్లీ డీ గ్లామర్ రోల్ తో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేసిన సినిమా దసరా. నానితో రెండో సారి జత కట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో వెన్నెలగా ఆకట్టుకుంది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరుకు చెల్లెలుగా నటిస్తోంది. ఇదే కాకుండా మామన్నన్, రివాల్వర్ రీటా వంటి సినిమాలు కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి.
చెమటలు పట్టించేలా: ఇక బ్యూటిఫుల్ మహానటి కీర్తి సురేష్ యోగా డే 2023 సందర్భంగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఇందులో యోగా సూట్ ధరించిన కీర్తి కాళ్లు చాపి, ముందుకు వంగి, వెన్ను పక్కకు వాల్చి పలు కష్టమైన ఆసనాలు వేసింది. ఆసనాలతో పాటు కీర్తి లెగ్స్ అందాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇలా ఆసనాలతోనే చెమటలు పట్టిస్తున్న కీర్తి వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











