twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం కూడా కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్.. అస్సలు తగ్గట్లేదుగా!

    |

    మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది నటీనటులకు టెక్నీషియన్స్ కు ఎంతో ఆశ ఉంటుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా మిగతా సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మెగాస్టార్ సినిమా కోసం నటించాలని అనుకునే సినీ నటులు కూడా ఉంటారు. అభిమానులు ఎంతగా ఇష్టపడతారో అదే తరహాలో కొంతమంది టాప్ సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ చిరంజీవిని అంతే ఆప్యాయంగా అభిమానిస్తారు. ఫ్యాన్ మూమెంట్ ని మర్చిపోతే తమ జీవితంలో కొంత ఆనందాన్ని మర్చిపోయినట్లే అని చాలామంది సెలబ్రిటీలు చెబుతుంటారు. మెగాస్టార్ సినిమా వస్తే చాలు కొంతమంది హీరోలు కూడా ఒక సాధారణ ఫ్యాన్స్ తరహాలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక కీర్తి సురేష్ కు మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం లభించిన విషయం తెలిసిందే. అయితే ఆమె సిస్టర్ పాత్ర కోసం కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

    ఫ్యాన్ మూమెంట్స్

    ఫ్యాన్ మూమెంట్స్

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆదివారం రోజు తన పుట్టిన రోజున సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పుట్టిన రోజున ఎంతోమంది అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కు ప్రత్యేకంగా విషెస్ ను అందించారు. మెగాస్టార్ తో మూమెంట్స్ ను గుర్తుచేసుకుంటూ కొందరు ప్రత్యేకమైన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనదైన శైలిలో మెగాస్టార్ పై అభిమానాన్ని చూపించారు. ఆమె బోళా శంకర్ పాత్రలో మెగాస్టార్ కు సోదరిగా కనిపించబోతోంది.

    కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిగతా హీరోయిన్స్ అంటే కాస్త భిన్నంగా గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ హోమ్లీ బ్యూటీ తోనే అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం అమ్మ చేతిలో అయితే పెద్ద సినిమాలే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో బోళా శంకట్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

    సిస్టర్ ఎమోషన్

    సిస్టర్ ఎమోషన్

    మెగాస్టార్ చిరంజీవి వేదాళం సినిమా రీమేక్ లో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. మళ్ళీ ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా సిస్టర్ ఎమోషన్ ను గట్టిగానే ఎలివేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన వేదాళం కథను తెలుగులో బోళా శంకర్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కూడా ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక దర్శకుడు మెహర్ రమేష్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మొదట పాత్ర కోసం చాలా మంది అగ్ర హీరోయిన్స్ ను సంప్రదించినప్పటికీ ఫైనల్ గా కీర్తి సురేష్ ను ఫిక్స్ చేసుకున్నారు.

    మెగాస్టార్ సలహా మేరకు..

    మెగాస్టార్ సలహా మేరకు..

    సాయి పల్లవిని కూడా ఫస్ట్ ఆప్షన్ గా అనుకున్నట్లు ఆ మధ్యలో అయితే టాక్ వచ్చింది. సాయి పల్లవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా సిస్టర్ పాత్రను డిజైన్ చేసుకున్నారట. అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ సాయిపల్లవి బిజీగా ఉండడం వల్ల ఆ పాత్రని చేయడం లేదని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక దర్శకుడు మెహర్ రమేష్ మెగాస్టార్ సలహా మేరకు కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మెగాస్టార్ ఆఫర్ అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

    భారీ రెమ్యునరేషన్

    భారీ రెమ్యునరేషన్

    అయితే మెగాస్టార్ తో సినిమా అనగానే చాలా మంది సినీ ప్రముఖులు రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా నటించడానికి ఒప్పుకుంటారు. అమితాబచ్చన్ లాంటి అగ్ర నటులు కూడా సైరా సినిమాలో నటించేందుకు పారితోషికం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మెగాస్టార్ తో నటించాలనే కోరిక తోనే రెమ్యునరేషన్ విషయాన్ని పట్టించుకోరు. బోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా కీలకం కాబట్టి ఆమెకు రెమ్యూనరేషన్ కూడా అధికంగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోలతో నటిస్తోంది ఇంకా అమ్మడు ఒక్కో సినిమాకు ప్రస్తుతం మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్లో నటించడం కోసం కూడా ఆమెకు అదే స్థాయిలో పారితోషకం ఇస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

    Recommended Video

    Megastar Chiranjeevi 66th Birthday Special Song Promo
    చేతినిండా సినిమాలు

    చేతినిండా సినిమాలు

    కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే నితిన్ తో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. మరో ఐదేళ్ల వరకు కూడా ఈ బ్యూటీ కెరీర్ కు ఏ మాత్రం డోకా లేదని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ చేయకపోయినా కూడా ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్ బాబుతో నటిస్తున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అలాగే రజనీకాంత్ తో నటిస్తున్న అన్నత్తే సినిమా కూడా ఈ ఏడాది దీపావళికి రాబోతోంది. వీటితోపాటు మరో రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది

    English summary
    Keerthy suresh solid remuneration for megastar upcoming project,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X