Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కీర్తి సురేష్‌ను ఎలా ఆటపట్టించారో చూడండి.. వీడియో వైరల్
మహానటి కీర్తి సురేష్ లాక్డౌన్లో ఫుల్ సందడి చేసింది. వర్కౌట్లు, పెట్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కీర్తి సురేష్ తెగ హల్చల్ చేసింది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంలోకి దిగిన పెద్ద హీరోయిన్గా పెంగ్విన్ సినిమాతో కీర్తి సురేష్ రికార్డు క్రియేట్ చేసింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కీర్తి నటనకు ప్రశంసలు లభించాయి. అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కీర్తి సురేష్ ఈ లాక్ డౌన్లో తెగ కష్టపడినట్టు కనిపిస్తోంది. సన్నజాజిలా, మల్లెతీగలా నాజూగ్గా తయారైంది. అయితే ఇది తన తదుపరి ప్రాజెక్ట్ కోసమే అయి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక తన తదుపర చిత్రాలైన రంగ్ దే, గుడ్ లక్ సఖిలతో నానా రచ్చ చేసింది కీర్తి సురేష్. నితిన్ పెళ్లి కానుకగా విడుదలైన టీజర్లో, ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్‌లో రాత్రివేళ లేడీ యాంకర్ ఇంట్లో రచ్చ.. సంబరాల్లో మునిగితేలిన రవి అండ్ కో భాగంగా రిలీజ్ చేసిన గుడ్ లక్ సఖి టీజర్లోనూ కీర్తి సురేష్ హైలెట్ అయింది.
ఇక తాజాగా కీర్తీ సురేష్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. స్పెయిన్ విను వీధుల్లో, మలగా అనే ఊర్లో తిరిగిన ఫోటోలను షేర్ చేస్తూ కీర్తి హల్చల్ చేస్తోంది. అక్కడ కీర్తిని ఆట పట్టిస్తున్నట్టుగా, బొమ్మల్లాంటి మనుషుల్లాంటి మధ్య నిల్చున్న ఫోటోలు, అందులో కీర్తిని సుత్తితో కొట్టినట్టు కనబడటం ఇలా కీర్తి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి కీర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే మార్మోగిపోతోంది. ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీత పాత్రకు కీర్తి సురేష్‌ను తీసుకోబోతోన్నట్టుగా వార్తలు వినిపించాయి.