ఆ బిగ్ బడ్జెట్ సినిమా కోసం అనుష్కకు పోటీగా కీర్తి సురేష్
స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ అందుకున్న తరువాత కొన్నిసార్లు సీనియర్ హీరోయిన్స్ తో పోటీ పడక తప్పదు. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఒక సినిమా కోసం సీనియర్ హీరోయిన్ అనుష్కకు అనుకోకుండా అడ్డు తగులుతోందట. కీర్తి సురేష్ మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.
అయితే ఇటీవల కీర్తి సురేష్.. అనుష్కకు ఆల్ మోస్ట్ సెట్టయిన బిగ్ బడ్జెట్ ప్రాజెక్టును తనవైపుకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ తో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'వెట్టయ్యడు విలైయాడు'(2006) అనే సినిమాకు సీక్వెల్ ని రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో అప్పట్లో ఆ సినిమా రఘువరన్ గా విడుదలైంది. ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు స్టార్ హీరోయిన్స్ తో చర్చలు జరుపుతున్నారు.

అసలైతే హీరోయిన్ గా మొదటి అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట. కానీ సడన్ గా దర్శకుడు కీర్తి సురేష్ వైపు తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉన్నాడు. కరోనా వైరస్ తగ్గిన తరువాతనే కమల్ హాసన్ తో షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











