Keerthy Suresh: చెమటలు పట్టిస్తున్న కీర్తి సురేష్ హాట్ వీడియో.. ఆసనాలతోనే ఇలా అయితే ఎలా?

ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే హీరోయిన్లు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన బ్యూటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి మూవీ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మరిచిపోలేని స్థానం సంపాదించుకుంది.

అంతేకాకుండా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్న కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి ఫెయిల్యూర్స్ అందుకుంది. అయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా అట్రాక్ట్ చేస్తోంది.

వివిధ భాషల్లో సినిమాలు..

వివిధ భాషల్లో సినిమాలు..

చిన్నతనంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, హీరోయిన్ గా అలరిస్తుంటారు కొంతమంది. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో కథానాయికగా డెబ్యూ చేసింది. అక్కడ హీరోయిన్ గా హిట్ కొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించింది. ఇలా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న క్రమంలోనే తెలుగు చిత్రపరిశ్రమలోకి సైతం అడుగు పెట్టింది.

దేశవ్యాప్తంగా గుర్తింపు..

దేశవ్యాప్తంగా గుర్తింపు..

టాలీవుడ్ లోకి రామ్ పోతినేని హీరోగా చేసిన నేను శైలజ సినిమాతో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఈ సినిమాలో సైలెంట్ గా ఉండే పాత్రలో మెప్పించింది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి అందాల అభినయ తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.

క్రమంగా పెరుగుతున్న డిమాండ్..

క్రమంగా పెరుగుతున్న డిమాండ్..

సినీ కెరీర్ ప్రారంభంలోనే మలయాళం, తమిళం వంటి భాషల్లో నటించిన కీర్తి సురేష్ కు ఆ అనుభవం తెలుగులో బాగా ఉపయోగపడింది. అందుకే మహానటి చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. దీంతో ఈ ఒక్క సినిమాతో తెలుగులో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అలాగే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు..

లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు..

కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను, లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ఓకే చేసింది. ఈ క్రమంలోనే మిస్​ ఇండియా, గుడ్​ లక్​ సఖి, చిన్ని వంటి సినిమాలు చేసింది. అయితే వాటి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది.

హోమ్లీగా కనిపించే కీర్తి సురేష్..

హోమ్లీగా కనిపించే కీర్తి సురేష్..

సినిమాలే కాకుండా గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసింది కీర్తి సురేష్. అయితే ఈ పాటతో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంది కీర్తి సురేష్. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్​ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్​ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. కీర్తి సురేష్ అకౌంట్​లో ఓ హిట్​ ఉండేలా చేసింది. అయితే ఎప్పుడూ హోమ్లీగా కనిపించే కీర్తి సురేష్ ఇందులో అందాలను ఆరబోసింది.

తడిచిన అందాలతో..

తడిచిన అందాలతో..

కీర్తి సురేష్ గ్లామర్ ఒలకబోయడమే కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో తన అందాలను వడ్డిస్తూ అట్రాక్ట్ చేస్తోంది కీర్తి సురేష్. అయితే నానితో రెండోసారి నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమాలో మాత్రం డీగ్లామర్ రోల్ చేసింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇక అభిమానుల కోరిక మేరకు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో దర్శనమిస్తుంది కీర్తి సురేష్. ఆ మధ్య తడిచిన అందాలతో కనువిందు చేసిన కీర్తి సురేష్ తాజాగా వీడియో వదిలింది.

అలవోకగా ఆసనాలు వేస్తూ..

బ్యూటిఫుల్ మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తాజాగా వదిలిన వీడియోలో యోగాసనాలు వేస్తూ కనిపించింది. యోగా సూట్ లో కీర్తి సురేష్ అందాలు ఆరబోసింది. ఇందులో ఆమె థైస్, షోల్డర్ అందాలు ప్రదర్శించింది. అయితే అంతకన్నా ఎక్కువగా ఆమె వేసిన ఆసనాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. విభిన్నమైన పొజిషన్ లో ఎంతో కష్టంగా ఉన్న ఆ ఆసనాలను అలవోకగా కీర్తి సురేష్ వేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చూపరులను ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X