కీర్తి సురేష్ హాట్ షో.. ఎద అందాలు కనిపించేలా.. అది చేత్తో పట్టుకుని కొంటె చూపులు!
ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే హీరోయిన్లు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. రామ్ పోతినేని మూవీతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టి నాగ్ అశ్విన్ మహానటి మూవీ ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మరిచిపోలేని స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్న కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించి ఓటమి పాలైంది. అయితే ఏమాత్రం దక్కని ఆమె క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది.

బాలనటిగా..
చిన్నతనంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, హీరోయిన్ గా అలరిస్తుంటారు కొంతమంది. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మలయాళంలో బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో కథానాయికగా డెబ్యూ చేసింది. అక్కడ హీరోయిన్ గా హిట్ కొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించింది. ఇలా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న క్రమంలోనే తెలుగు చిత్రపరిశ్రమలోకి సైతం అడుగు పెట్టింది.

దేశవ్యాప్తంగా..
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రామ్ పోతినేని హీరోగా చేసిన నేను శైలజ చిత్రంతో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ కీర్తి సురేష్. ఈ సినిమాలో సైలెంట్ గా ఉండే పాత్రలో మెప్పించింది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి అందాల అభినయ తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె యాక్టింగ్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.

దక్షిణాది భాషల్లో..
సినీ కెరీర్ ప్రారంభంలోనే మలయాళం, తమిళం వంటి భాషల్లో నటించిన కీర్తి సురేష్ కు ఆ అనుభవం తెలుగులో బాగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. అందుకే మహానటి చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఇలా ఈ ఒక్క సినిమాతో తెలుగులో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అలాగే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

సెట్ అయ్యే పాత్రల్లో..
కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన కీర్తి సురేష్ రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను, లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ఓకే చేసింది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి సినిమాలు చేసింది. అయితే వాటి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.

గ్లామర్ టచ్..
సినిమాలే కాకుండా గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసింది కీర్తి సురేష్. అయితే ఈ పాటతో ఎక్కువగా విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా జనాల్లోకి పూర్తిగా ఎక్కకపోయిన బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపించింది. కీర్తి సురేష్ అకౌంట్లో ఓ హిట్ ఉండేలా చేసింది. అయితే ఎప్పుడూ హోమ్లీగా కనిపించిన కీర్తి సురేష్ ఇందులో కాస్తా గ్లామర్ షో చేసింది.

మహేశ్ బాబు ఫ్యాన్స్ అసహనం..
అయితే సర్కారు వారి పాట సినిమాకు ముందు ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవద్దు అంటూ మహేశ్ బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆమె నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో కీర్తి సురేష్ ను ప్లాప్ హీరోయిన్ గా భావించారు. అలాగే గాంధారితో విమర్శలు రావడం కూడా ఒక కారణమైంది. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సినిమాలో లాగానే కీర్తి సురేష్ గ్లామర్ ఒలకబోయడమే కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో తన అందాలను వడ్డిస్తూ అట్రాక్ట్ చేస్తోంది కీర్తి సురేష్.
చేత్తో పట్టుకుని కొంటెగా చూస్తూ..
మార్చి 30న దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న కీర్తి సురేష్ తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ వదిలింది. ఇందులో నల్ల చీర, జాకెట్ వేసుకుని చాలా అందంగా దర్శనం ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. వివిధ యాంగిల్స్ లో కూర్చోని, నిల్చోని పోజులిచ్చిన బ్యూటిఫుల్ కీర్తి సురేష్ తన ఎద అందాలను ప్రదర్శించింది. చూపించి చూపించనట్లుగా నడుము అందాలను ఆరబోసింది. మెడలోని పెండెంట్ చేత్తో పట్టుకుని కొంటెగా చూస్తున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











