చిరుకు హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ.. మహానటిని ఎంచుకున్న కొరటాల!
రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు, కొరటాల శివ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొరటాల శివ చిరంజీవికి జోడి కోసం పలువురి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు.
అనుష్క, నయనతార లాంటి క్రేజీ హీరోయిన్ల పేర్లని కొరటాల శివ ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. కథలో భాగంగా చిరంజీవి సరసన కీర్తి సురేష్ అయితే బావుంటుందని కొరటాల భావిస్తున్నారట. కీర్తి సురేష్ గత ఏడాది మహానటి చిత్రంలో అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే.

మహానటి తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని కీర్తి సురేష్ ఎంచుకుంటోంది. జూన్ నుంచి కొరటాల, చిరంజీవి చిత్రం పట్టాలెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ చిరంజీవి కోసం ఓ సందేశాత్మక కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











