Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
కీర్తి డామినేషన్ మామూలుగా లేదు.. ఒక వైపు ప్రభాస్ మరోవైపు రజినీ, బన్నీ.. ఇంకా..
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే చాలా వరకు గ్లామర్ ప్రజెంటేషన్ తప్పనిసరిగా మారిపోయింది అనేలా ఒక టాక్ వచ్చేసింది. కానీ కేవలం కొంతమంది మాత్రమే గ్లామర్ డోస్ పెరగకుండా ఒక లిమిట్ లోనే ఉంటూ బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. అయితే అందులో చాలా మంది కూడా ఎక్కువ కాలం కొనసాగడం లేదు. కానీ కీర్తి సురేష్ మాత్రం చాలా సింపుల్ గానే కనిపిస్తూ నటనతోనే ఛాన్సులు దక్కించుకుంటోంది.
Recommended Video
చేతిలో ఆరు సినిమాలు
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని తుది దశలో ఉన్నాయి. రంగ్ దే సినిమాతో పాటు గుడ్ లక్ సఖి సినిమాలు రిలీక్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మిస్ ఇండియా సినిమా కూడా రెడీ అవుతోంది. ఈ సినిమాల రిజల్ట్ తప్పకుండా కీర్తి కెరీర్ కి మరింత బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయని తెలుస్తోంది.
రజినీకాంత్ సినిమాలో..
అలాగే మరో వైపు స్టార్ హీరో రజినీకాంత్ తో కూడా అన్నత్తై సినిమా ద్వారా జతకట్టనుంది. అలాగే మరో తమిళ్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహానటి మళయాళం కూడా మరక్కర్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. వీటితో పాటు తెలుగు స్టార్ హీరోలతో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబుతో పాటు..
ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాటకు హీరోయిన్ కీర్తి ఒకే అయినట్లు టాక్ వస్తోంది గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక అమ్మడు రీసెంట్ గా మరికొంత మంది స్టార్ హీరోలతో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. చూస్తుంటే సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా మరో ఐదేళ్ల వరకు చక్రం తిప్పేలా ఉందని రూమర్స్ వస్తున్నాయి.
ప్రభాస్ కి జోడిగా..
ప్రభాస్ ఇటీవల ఆది పురుష్ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో దర్శకుడు కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట. రాముడిగా కనిపించే ప్రభాస్ కి సీతగా కనిపించాలి అంటే కీర్తి సురేష్ సరైన జోడి అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి.
బన్నీతో కూడా..
అయితే పాన్ ఇండియా సినిమాలో హిందీ మార్కెట్ కీలకం కాబట్టి హిందీలో అంతగా క్రేజ్ లేని కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక త్వరలో బన్నీ కొరటాల కాంబినేషన్ లో రానున్న సినిమాకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని వర్కౌట్ అయితే గనక కీర్తి కెరీర్ మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.