పేషెంట్‌లా చూడలేకపోతున్నాం తల్లో.. ఎలాంటి దానివి ఎలా అయ్యావ్.. కీర్తి సురేష్‌పై కామెంట్లు
ముద్దుగా, బోద్గుగా కనిపించి మహానటి చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న కీర్తీ సురేష్ ఇప్పుడు ఫ్యాన్స్ షాకిచ్చింది. తాను నటించే సినిమా కోసం సన్నటి మెరుపు తీగలా మారిపోయింది. మహానటిలో బొద్దుగా కనిపించిన అమ్మాయి ఈమేనా అని అందరూ ముక్కున వేలేసుకోవడం తక్కువైంది. తాజాగా స్పెయిన్ విహరిస్తున్న ఈ అందాల భామ బాత్రూం రోబ్‌తో కనిపించింది. దాంతో ఫ్యాన్స్ మరోరకంగా స్పందిస్తున్నారు. తాజాగా కీర్తీ సురేష్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..

పేషెంట్‌లా ఉంటే చూడలేక
తెలుగులో మహేష్ కోనేరు నిర్మిస్తున్న సఖి సినిమా కోసం కీర్తీ సురేష్ ఊహించని విధంగా బరువు తగ్గింది. చక్కనమ్మ చిక్కినా అందమే అనుకొంది. కానీ ఫ్యాన్స్ నిన్ను ఇలా పేషెంట్‌లా ఉంటే చూడలేకపోతున్నాం. మళ్లీ బరువు పెరిగి లావుగా మారండి అని ఫ్యాన్స్ గొడవ పెడుతున్నారు. మళ్లీ పాత కీర్తీ సురేష్‌ను చూడాలనుకొంటున్నాం అని కామెంట్లు పెడుతున్నారు.

సన్నపడితే మరీ బాధగా ఉంది
కీర్తీ సురేష్‌ను ఉద్దేశించి ఘాటుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు చాలా సన్నపడ్డారు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం', ‘మీరు ఇలా సన్నగా ఉంటే మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది', దయచేసి మీరు మళ్లీ లావుగా మారండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

లావుగా ఉంటేనే ఇష్టమని
‘సన్నగా కంటే లావుగా ఉన్నప్పుడే అందంగా ఉండేదానివి, ఎలాంటి డ్రస్సులు వేసేదానిని. జిమ్ జీవితంతో మీ హాలత్ (పరిస్థితి) ఎలా మారిపోయింది', నీవు లావుగా ఉంటేనే ఇష్టపడుతాం. ఈ రకంగా సన్నపడితే కష్టం అని నెటిజన్లు కామెంట్లతో హడలెత్తిస్తున్నారు.

45 రోజులపాటు సఖీగా
ప్రస్తుతం నరేంద్రనాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మిస్తున్న సఖీ చిత్రంలో కీర్తీ సురేష్ నటిస్తున్నది. ఈ చిత్రం 45 రోజులపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమా కోసం 50 మందితో కూడిన నటీనటులు, సాంకేతిక బృందం జూన్ 17న యూరప్‌కు వెళ్లింది. స్పెయిన్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తారని సమాచారం. జూలై చివరి వారంలో యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుంది.

మన్మథుడు చిత్రంలో నాగ్‌తో
ఇక అక్కినేని నాగార్జున హీరోగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మన్మథుడు 2 చిత్రంలో కీర్తీ సురేష్ అతిథి పాత్రలో కనిపిస్తారు. తాజాగా నాగార్జునతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. నాగ్‌తో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తాను అని కీర్తీ సురేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











