Breakup: జయం రవితో బ్రేకప్... గుట్టు విప్పిన సింగర్ కేనీషా ఫ్రాన్సిస్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవికి తన ప్రియురాలు కేనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ చెప్పారు. గత కొద్దికాలంగా వీరి బంధంపై ఎన్నో వివాదాలు, విమర్శలు ఎదురయ్యాయి. తమ వైవాహిక జీవితాన్ని కేనీషా చెడగొట్టిందని, ఆమె కారణంగానే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని జయం రవి భార్య ఆర్తి రవి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రోలింగ్, వేధింపులను ఎదుర్కొన్న కేనీషా ఫ్రాన్సిస్.. జయం రవి జీవితంలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు కేనీషా. ఈ వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా నేనెందుకు స్పందించడం లేదని నన్ను అడుగుతున్నారు. ఇదంతా విన్న తర్వాత నేను మౌనంగా ఉండలేను. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేదానిగా నాపై ముద్రవేశారు. బహుశా ఇదే నా చివరి స్పందన కావొచ్చు. నేను మా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తెను, ఇప్పుడు వారు ఈ లోకంలో లేరు. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు నా సొంత బంధువు ఒకరు నన్ను లైంగికంగా వేధించారు. 18 ఏళ్లకే నాకు పెళ్లైంది. కానీ ఆ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే సాగింది. అతనికి చాలామంది మహిళలతో అక్రమ సబంధాలు ఉండేవి. ఆ మానసిక, శారీరక ఒత్తిడి కారణంగానే నా బిడ్డను కోల్పోయానని కేనీషా ఆవేదన వ్యక్తం చేశారు.

మొదట మా అమ్మ చనిపోయారు, ఆ తర్వాత నాలుగేళ్లకే నాన్న కూడా వెళ్లిపోయారు. దాంతో పదేళ్లపాటు ఒంటరిగానే బతికాను. నన్ను ఎగతాళి చేయడానికి నా గతాన్ని తవ్వి తీసేవాళ్లు చాలామంది ఉన్నారు. నేను బార్‌లలో రాత్రికి 500 రూపాయలకు పాటలు పాడుతూ నా కెరీర్ ప్రారంభించాను. ఈ రోజు అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇప్పుడు అందరూ నన్నే లక్ష్యంగా చేసుకున్నారు. కొదరు నా వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవడానికి బెంగళూరుకు డిటెక్టివ్‌లను పంపారు. నేను మా నాన్నని వృద్ధాశ్రమంలో చేర్చానని కూడా పుకార్లు వ్యాపింపజేశారని కేనీషా మండిపడ్డారు.
గర్భంలోనే బిడ్డను కోల్పోయిన ఒక మహిళ .. ఒకరి కుటుంబంలోని వ్యక్తిని అతని పిల్లకు దూరం చేస్తుందా? రవి మోహన్ మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు సహాయం కోసం నా దగ్గరికి వచ్చాడు. ఒక థెరపిస్ట్‌గా నేను అతనికి చేయగలిగినదంతా చేశాను. కుటుంబంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పాను. కానీ అంతకుముందే అతను మానసికంగా దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో మేమిద్దరం స్నేహితులమయ్యాము.. ఈరోజుకీ స్నేహితులగానే కొనసాగుతున్నాం. నేను ఎవరినీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయలేదు. ఆ అవసరం కూడా నాకు లేదని కేనీషా స్పష్టం చేశారు.
ఈ కథలోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను.. ఇప్పుడు మౌనంగా వెనుదిరుగుతున్నాను. ఈ ప్రపంచం మొత్తం అహంకారాలు, నిరాధారమైన వార్తలతో నిండిపోయింది. ఇక్కడ మంచితనానికి చోటు లేదు.. అలాంటప్పుడు ప్రేమ కూడా బరువుగానే మారుతుంది. ఒకరిని రక్షించే క్రమంలో నేను చాలా కోల్పోయాను. సినిమా పరిశ్రమకు, అతనిని ప్రేమించే వారికి, సమర్ధించే వారితో పాటు అతడి జీవితంపై వారి మాత్రమే హక్కులు ఉన్నాయనుకునే వారికి చెబుతున్నాను.. ఇకపై అతను మీ వాడే. ఇకపై ఈ యుద్ధాలు చేయలేదను, పోరాడలేను, వివరణలు ఇవ్వలేను. మంచి వ్యక్తికి అండగా నిలవాలని ముందుకు రావడం నా మూర్ఖత్వం. ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులతో, మాయగాళ్లతో నిండిపోయింది. ఇప్పటి నుంచి అతనిని పూర్తిగా వదులుకుంటున్నాను. నేను జీవితంలో ఓడిపోయాను.. చెన్నై నగరాన్ని, నాకు ఇష్టమైన సంగీతాన్ని, నా థెరపీని వదిలేస్తున్నాను. ఆన్‌లైన్‌లో వేధింపులు, ట్రోలింగ్ కారణంగానే నేను వీటికి దూరంగా ఉంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేస్తున్నా. దేవుడు సృష్టించిన దానిని మనుషులు ముక్కలు చేయగలరని అర్ధం చేసుకున్నానని కేనీసా ఫ్రాన్సిస్ పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications


