కేతికా శర్మ పంట పండింది.. 5 ఏళ్లుగా అలాంటి విమర్శల తర్వాత
యంగ్ హీరోయిన్ కేతిక శర్మ మొదటి నుంచి టాలీవుడ్ లోనే హీరోయిన్ గా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. తన కెరియర్ ను సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల పాటు కేతికా శర్మ ఓపిగ్గా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఒక్క స్పెషల్ సాంగ్ తో దుమ్ములేపింది. ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి సినిమా అవకాశాలను తన సొంతం చేసుకుంటోంది.
కేతికా శర్మ తెలుగు చిత్రాలు..
నార్త్ కు చెందిన కేతికా శర్మ 'రొమాంటిక్' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత నాగ శౌర్య లక్ష్య, పంజా వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా వంటి చిత్రాల్లో అవకాశం అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' చిత్రంలోనూ హీరోయిన్గా నటించింది. అటు తమిళంలోనూ విజయ్ 69 చిత్రంలో మెరిసింది. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన ఫలితానివ్వలేదు. అయినా పట్టు వదలకుండా తెలుగు సినిమాల్లోనే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

ఒక్క సాంగ్ దశ తిరిగింది..
5 ఏళ్లుగా స్ట్రాంగ్ హిట్ కోసం కేతికా శర్మ ఎంతగానో ఎదురు చూస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది. చివరిగా నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. 'అది దా సర్ ప్రైజ్' సాంగ్ లో నటించిన కేతికా శర్మకు మాత్రం మంచి మైలేజ్ ను తెచ్చి పెట్టింది. ఆ స్పెషల్ సాంగ్ కూడా హిట్ కావడంతో కేతికా ఇప్పుడు మోస్ట్ వాటెంటెడ్ నటిగా మారిపోయింది. ఆమెకు తమిళం, తెలుగు నుంచి వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుతున్నాయని తెలుస్తోంది.
అలాంటి విమర్శలు ఎదుర్కొని..
కేతికా శర్మ మొదటి నుంచి గ్లామర్ షోలో ఎక్కడా తగ్గలేదు. తొలి సినిమాతోనే తన స్టన్నింగ్ బ్యూటీతో ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేసింది. హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదని ఈ ముద్దుగుమ్మ కాస్తా ఆలస్యంగా తెలుసుకుంది. కాస్తా నటన, ఇతర స్కిల్స్ పై ఫోకస్ పెట్టింది. తన సినిమాలు, చేయబోయే పాత్రలపై సరైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కెరీయర్ లో తొలిసారిగా స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. దాంతో దారుణంగా విమర్శలను ఎదుర్కొంది. కానీ ఎట్టకేళలకు సౌత్ లో హాట్ టాపిక్ గ్గా మారిపోయింది. తన హుక్ స్టెప్ తో ఊపేసింది.
ఆరు చిత్రాల్లో కేతికాకు అవకాశం..
రాబిన్ హుడ్ చిత్రం ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుకుతున్నాయి. రీసెంట్ గానే శ్రీవిష్ణు సరసన 'సింగిల్' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కాస్తా పాజిటివ్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఇక ఇప్పుడు తమిళంలో కమల్ హాసన్ తో విశ్వరూపం చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాజేశ్ ఎం సెల్వతో కలిసి ఒక సినిమా చేయబోతోంది. ఇది గాక మరో ఐదు ప్రాజెక్ట్స్ కు కేతికా శర్మ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది మొత్తం కూడా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండబోతోందని అంటున్నారు. ఏదేమైనా కేతికా శర్మ టైమ్ స్టార్ట్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











