మళ్లీ తెగించిన బ్రో హీరోయిన్.. ఉక్కపోత పెట్టిస్తున్న పరువాల విందు.. చూస్తే తట్టుకోలేరు!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు బ్రో. మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటికి బ్రో సినిమా కొంతగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలను ఘాటుగా వడ్డించే ఈ చిన్నది మరోసారి తన టాలెంట్ చూపించింది.
వీడియోకి అలా:మోడలింగ్ రంగంలో తన ఘాటు అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ లో రాణించిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ మోస్ట్ గ్లామరస్ బ్యూటి. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది.

సోషల్ మీడియా స్టార్:సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ భామ కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే తెలుగు నుంచి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి కేతిక తెలుగు చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కొనసాగిన హవా:అక్టోబర్ 29, 2021లో విడుదలైన రొమాంటిక్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె అనేక మంది యూత్ కు క్రష్‌గా మారిపోయింది. రొమాంటిక్ మూవీ ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. అలా తన హవాను కొనసాగించింది.

నిరాశను మిగిల్చి..:ఇక రెండో చిత్రంగా ముద్దుగుమ్మ కేతిక శర్మ హీరో నాగశౌర్యతో 'లక్ష్య' సినిమాకు జోడీ కట్టింది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' సినిమాలోనూ ఆకట్టుకుంది కేతిక శర్మ. ఈ మూవీ కూడా బ్యూటిఫుల్ కేతిక శర్మకు నిరాశనే మిగిల్చింది.
రొమాంటిక్ సీన్స్:అయితే రంగరంగ వైభవంగా సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టింది కేతికా శర్మ. దీంతో మళ్లీ ఆమె కాస్తా పాపులర్ అయింది. కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు ఏ సినిమా కూడా సరైన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయితే ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వచ్చాయి.
ఉక్కపోత పెట్టిస్తూ:ఇటీవలే పవన్, సాయి తేజ్ బ్రో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ సోషల్ మీడియాలో ఆమె అందాలను విస్తరాకులా పరుస్తుంటుంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఊహించని విధంగా మళ్లీ రెచ్చిపోయింది. నిల్చుని వివిధ భంగిమల్లో పోజులిస్తూ తన పరువాలను ఘాటుగా చూపించింది. అలాగే మత్తెక్కే చూపులతో ఉక్కపోత పెట్టిస్తుంది ఈ బ్యూటి. దీంతో అవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











