కేతిక శర్మకు గోల్డెన్ ఆఫర్ మిస్.. సమంత వల్ల కెరీర్ డ్రాప్.. ఏమైందంటే?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ తన కెరియర్ ను సక్సెస్ బాటలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ చిత్రంతో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశపురి హీరోగా నటించిన ఆ చిత్రం యువతను ఓ మేరకు అలరించింది. ఇక కేతిక శర్మ కూడా తన బ్యూటీతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ చిత్రంలో కేతిక తన బోల్డ్ పర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. దాంతో ఇండస్ట్రీలో కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రొమాంటిక్ చిత్రంలో కేతిక నటించిన పాత్రకు, తన గ్లామర్ గ్లా పర్ఫామెన్స్ కు ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు కూడా ఆకర్షితులయ్యారు. ఆ చిత్రం తర్వాత కేతిక శర్మకు టాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ దక్కాయి. యంగ్ హీరో నాగ శౌర్య లక్ష్య, పంజా వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా వంటి చిత్రాల్లో అవకాశం అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలోను హీరోయిన్గా అలరించింది. ఇలా వరుసగా ఆఫర్లు అందుకుంటూనే వస్తుంది.

కానీ ఇప్పటివరకు కేతికా శర్మకు సరైన హిట్ పడడం లేదు. అయితే ముద్దుగుమ్మకు ప్రారంభంలోనే ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. తన కెరియర్ ను ఆకాశంలో నిలబెట్టే అద్భుతమైన అవకాశం గుమ్మం వరకు వచ్చి అందకుండా పోయింది కేతికకు. ఇప్పుడు ఆఫర్ ఏంటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ఆఫర్ మిస్ కావడానికి కారణం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అయితే, సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మొట్టమొదటిసారిగా ఐటెం సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పలో... ఊ అంటావా మామ... సాంగ్ లో సమంత నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సమంత పర్ఫామెన్స్ కు, దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్ కు ప్రపంచం మొత్తం రెస్పాండ్ అయింది. ఈ సాంగ్ తో సమంతకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఆ సాంగ్లో వాస్తవానికి నటించాల్సింది కేతిక శర్మనే.
ఈ విషయాన్ని తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత ఎర్నేని రవిశంకర్ తెలియజేశారు. కేతిక శర్మ రాబిన్ హుడ్ చిత్రంలో... అది ద సర్ప్రైజ్... స్పెషల్ సాంగ్ లో నటించి ఇప్పుడు సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మకు పుష్ప సినిమాలోనే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అప్పుడు కుదరలేదు, అందుకని ఇప్పుడు రాబిన్ హుడ్ లో స్పెషల్ సాంగ్ చేయించామని నిర్మాత చెప్పారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజెన్లు కేతికకు గోల్డెన్ ఆఫర్ మిస్ అయింది అంటూ చర్చించుకుంటున్నారు. సమంత ప్లేసులో కేతిక శర్మ... ఊ అంటావా మామ... సాంగ్లో నటించి ఉంటే మాత్రం ఇప్పుడు ఆమె రేంజ్ వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











