నాగినిలా బుసలు కొడుతున్న కేతిక శర్మ .. స్లీవ్ లెస్ ఔట్ ఫిట్‌లో కవ్వింపులు
అందం , అభినయం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లకు ఎందుకో కాలం కలిసి రాదు. ఈ కోవలోకే వస్తారు ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. ఈమె క్యూట్ లుక్స్, ఫిగర్ చూసి ఖచ్చితంగా తెలుగు తెరను దున్నేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఈమెకు ప్రతికూలంగా మారాయి. హీరోయిన్‌గా చేసిన కొద్దిరోజులకే ఐటెం సాంగ్స్ చేసే స్థాయికి పరిస్ధితులు ఈమెను తీసుకొచ్చాయి.
తొలినాళ్లలో కేతిక మోడలింగ్ రంగంలో రాణించింది. అలాగే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్‌గానూ ఫేమస్. అమ్మానాన్నలు ఇద్దరూ ఫేమస్ డాక్టర్లు కావడంతో కూతురిని కూడా డాక్టర్‌గా చూడాలని ఈ దంపతులు ఆశపడ్డారు. కానీ డెస్టినీ ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన డెబ్యూ మూవీ రొమాంటిక్ ద్వారా తెలుగు వారిని కేతికా శర్మ .

ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్‌లోనూ ఎలాంటి బెరుకు లేకుండా నటించింది. రొమాంటిక్ తర్వాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్యలో, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకున్నారు కేతిక శర్మ. ఈ క్రమంలో ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాలో ఆఫర్ పట్టేసింది. ఈ భారీ మల్టీస్టారర్‌తో వరుస ఆఫర్లు అందుకుని కేతికా శర్మ స్టార్ హీరోయిన్‌గా మారుతుందని అంతా భావించారు.
కానీ కేతిక అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. బ్రో తర్వాత మరే తెలుగు సినిమాలో ఈ భామ కనిపించలేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంపై మొన్నా మధ్య ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా కోసం మనసుపెట్టి పనిచేస్తానని కానీ ప్రయత్నం మాత్రమే మనచేతుల్లో ఉంటుందని, ఫలితం ప్రజల చేతుల్లో ఉంటుందని కేతిక అన్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ ఆఫర్ అందుకున్నారు కేతిక శర్మ. అయితే అది హీరోయిన్‌గా కాదు.. ఐటెం సాంగ్‌లో.
నితిన్ , శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్‌లో కేతిక శర్మ ఐటెం సాంగ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ లిరికల్ వీడియోలో కేతిక తన నడము, నాభి అందాలతో మెస్మరైజ్ చేశారు. ఫుల్ వస్తే కానీ ఆమె ఎలా చేశారో తెలియదు. ఈ సాంగ్ కాకుండా శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కేతిక శర్మను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమెతో పాటు ఈ సినిమాలో ఇవానా కూడా శ్రీ విష్ణుతో రొమాన్స్ చేయనున్నారు.
చాలా రోజుల తర్వాత తెలుగులో వెను వెంటనే ఆఫర్లు వస్తుండటంతో కేతిక శర్మ గాల్లో తేలుతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తాజాగా స్లీవ్ లెస్ ఔట్ ఫిట్‌లో అందాలు ఆరబోస్తు చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం కేతిక అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











