పైట పక్కకు జరిపి కేతిక శర్మ పరువాల వడ్డింపు .. ఎద అందాలతో చంపేస్తున్న రొమాంటిక్ పోరి

రంగుల లోకంలో విహరించాలని, తారాపథంలో దూసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతోమంది యువత సినీ రంగం వైపు అడుగులు వేస్తారు. కానీ చిత్ర పరిశ్రమ విచిత్రమైనది. ఇక్కడ స్థిరపడాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని అనుభవజ్ఞులు అంటారు. అందం, అభినయం ఉన్నా అవకాశాలు రాక ఎంతో మంది అడ్రస్‌లు గల్లంతయ్యాయి. చూడటానికి ఏమాత్రం బాగోని వారు .. అంతంత మాత్రం నటనతో నెట్టుకొచ్చేవారు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తుంటారు. అలాంటి ఫస్ట్ లిస్ట్‌లోకి వస్తారు హీరోయిన్ కేతికా శర్మ. అందం, అభినయంతో పాటు మంచి ఫిజిక్ ఈ ముద్దుగుమ్మ సొంతం. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

తొలినాళ్లలో కేతిక మోడలింగ్‌ రంగంలో రాణించింది. అలాగే సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్‌గానూ ఫేమస్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కేతికను కూడా ఆమె తల్లిదండ్రులు వైద్యురాలిగా చూడాలనుకున్నారు. ఎందుకంటే అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లు కావడం కూడా ఇందుకు కారణం.

Ketika Sharma PhotoShoot with White colour saree Her latest photos here

కానీ విధి ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన డెబ్యూ మూవీ రొమాంటిక్‌ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు కేతికా శర్మ . లుక్స్ పరంగా గుడ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్‌లోనూ మొహమాటపడకుండా నటించింది. ఆ వెంటనే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్యలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో నటన, అందంతో మెస్మరైజ్ చేసింది .

ఆ వెంటనే ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీలో నటించింది. ఈ సినిమాతో వరుస ఆఫర్లు అందుకుని కేతికా శర్మ రేంజ్ మారిపోతుందని, స్టార్ హీరోయిన్‌గా మారుతుందని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే బ్రో తర్వాత ఈ నార్త్ ఇండియన్ భామ మళ్లీ కనిపించలేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంపై మొన్నా మధ్య కేతిక శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఎప్పటికైనా సినిమాల్లో అడుగుపెట్టాలని కలలు కన్నానని కేతిక చెప్పారు.

సినిమా కోసం మనసుపెట్టి పనిచేస్తానని కానీ ప్రయత్నం మాత్రమే మనచేతుల్లో ఉంటుందని, ఫలితం ప్రజల చేతుల్లో ఉంటుందని కేతిక అన్నారు. అందుకే తన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించనని ఆమె స్పష్టం చేశారు. రంగరంగ వైభవంగా సినిమాలో డాక్టర్‌గా నటించి.. నన్ను వైద్యురాలిగా చూడాలనుకున్న అమ్మానాన్నల కలను నెరవేర్చానని తెలిపారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చుక్కల చీర ధరించి పైట పక్కకు జరిపిన కేతిక శర్మ.. భారీ ఎద అందాలను ప్రదర్శిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Read more about: ketika sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X