Ketika Sharma : గుర్రమెక్కిన కేతికా శర్మ .. అందాల స్వారీ చేయమంటూ గ్లామర్ ట్రీట్

సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమ విజయం సాధించిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. ఎంతటి టాలెంట్ ఉన్నా, అంతకుమించిన స్పెషాలిటీ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. సహజంగానే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది చేసిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే కెరీర్‌లో ముందుకు సాగడం చాలా కష్టం. ఇలాంటి వారెందరో సినీ పరిశ్రమలో అడ్రస్ లేకుండా పోయారు.

చిత్ర సీమలో సక్సెస్ కావడానికి అందంతో పాటు అదృష్టం కావాలని పెద్దలు అంటుంటారు. ఈ క్రమంలోనే అందం , అభినయం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు స్టార్ డమ్ అందుకోలేకపోయారు. ఈ కోవలోకే వస్తారు ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. పర్ఫెక్ట్ ఫిగర్, వైట్ స్కిన్‌టోన్‌తో మెరిసిపోయే ఈ భామ టాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతుతారని అంతా అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. ఒకటి ఆరా సినిమాలు తీసినప్పటికీ తర్వాత కనిపించకుండా పోయారు కేతిక శర్మ.

Ketika Sharma PhotoShoot with yellow color sleeveless outfit Her latest photos here

తొలినాళ్లలో కేతిక మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గానూ పాపులారిటీ సంపాదించుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు కావడంతో కూతురిని కూడా డాక్టర్‌గా చూడాలని ఈ దంపతులు ఆశపడ్డారు. కానీ ఆమె అనూహ్యంగా సినీ రంగం వైపు అడుగులు వేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్‌ ద్వారా తెలుగు వారిని కేతికా శర్మ పలకరించారు.

ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌లోనూ ఎలాంటి బెరుకు లేకుండా నటించారు కేతిక. ఈ మూవీ తర్వాత లక్ష్యలో, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాలో ఆపర్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ ఆఫర్ అందుకున్నారు కేతిక శర్మ. అయితే అది హీరోయిన్‌గా కాదు.. ఓ ఐటెం సాంగ్‌లో.

నితిన్ , శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్ హుడ్‌లో కేతిక స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఇది కాకుండా శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే ఈమెతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా ఇవానా కూడా సెలెక్ట్ అయ్యారు,

తన కెరీర్ డైలమాలో పడని సమయంలో తర్వాత టాలీవుడ్‌లో వెను వెంటనే ఆఫర్లు వస్తుండటంతో కేతిక శర్మ సంతోషంతో గాల్లో తేలుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తాజాగా తన పుట్టినరోజును పురస్కరించుకుని ఓ వెకేషన్‌కు వెళ్లారు. ఓ బీచ్‌లో గుర్రంపైకెక్కి స్వారీ చేస్తూ అందాలు ఆరబోశారు. థైస్ కనిపించేలా ఒళ్లు విరుచుకుంటూ కేతిక శర్మ చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం కేతిక అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: ketika sharma movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X