కాలు పైకి లేపి మరీ అందాలు ఆరబోసిన అల్లు అర్జున్ హీరోయిన్
కేతిక శర్మ .. పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కేతిక తొలినాళ్లలో స్టార్ హీరో అల్లు అర్జున్‌తో కలిసి ఆహా యాప్‌కు సంబంధించిన యాడ్‌లో నటించింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ బ్రో, వైష్ణవ్ తేజ్ అంగరంగ వైభవంగా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే కేతిక నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో అమ్మడుకు తెలుగు అవకాశాలు తగ్గాయి. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కేతిక నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే కేతిక తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

ఇక కేతిక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను అభిమానుల ముందుంచింది. వంగ పువ్వు రంగు టాప్ ధరించిన కేతిక, బాటమ్ లో థై స్లిట్ డ్రెస్‌తో కూడిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ లుక్‌లో కేతిక రొమాంటిగ్గా కనిపిస్తోంది. అలా చేతిలో ఒక నవలను పట్టుకున్న కేతిక ఆదమరిచి చదివేస్తుంటే కెమెరా క్లిక్ లు హోరెత్తించాయి. కానీ కేతిక భంగిమలకు కుర్రకారు గుండె లయ తప్పి పోతోంది. వలపుల వయ్యారాలతో కుర్రకారును పరేషాన్ చేస్తుంది ఈ హ్యాట్ బ్యూటీ. అందాల డోస్ రోజు రోజుకు రెట్టింపు చేసి రచ్చ చేస్తుంది. కేతిక అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కేతిక లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











