అల్లు అర్జున్ తో అలాంటి సీన్లైనా ఓకే.. కేతికా శర్మ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. మంచి అవకాశం కోసం నానా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో కేతికా శర్మ ఎలాగైనా టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో నటించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే సినిమాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది.

కేతికా శర్మ గత చిత్రాలు..
నార్త్ కు చెందిన కేతికా శర్మ మొదటి నుంచి తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. 29 ఏళ్లు ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఫోకస్ మొత్తం కెరీయర్ పైనే పెట్టింది. న్యూ ఢిల్లీకి చెందిన కేతికా శర్మ డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అలా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కంట్లో పడింది. వెంటనే ఆమెకు 'రొమాంటిక్' అనే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆకాష్ పూరీ హీరోగా నటించిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఇదే కేతికా శర్మకు తొలిచిత్రం. ఆ తర్వాత 'లక్ష్య'. 'రంగ రంగ వైభవంగా', 'బ్రో', 'విజయ్ 69' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.

Ketika Sharma Shocking comments on Allu Arjun she wants to act with him

కేతికా శర్మ కాంట్రవర్సీ..
కేతికా శర్మ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న పెద్దగా సక్సెస్ రుచి చూడలేకపోతోంది. దీంతో కాస్తా రూటు మార్చి స్పెషల్ సాంగ్స్ లోనూ నటించేందుకు ఓకే చెబుతోంది. ఈక్రమంలోనే రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాబిన్ హుడ్' చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో నటించింది. 'అది దా సర్ ప్రైజ్' అంటూ యువతను ఉర్రూతలూగించింది. అయితే ఆమె వేసిన స్టెప్పుల కారణంగా తెలంగాణ స్టేట్ విమెన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో కేతికా ప్రయత్నానికి నిరాశే మిగిలింది.

అల్లు అర్జున్ సినిమాలో అవకాశం కోసం..
ఎలాగైనా పెద్ద ప్రాజెక్ట్స్ ల్లో అవకాశం పొందాలని కేతికా శర్మ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెగా హీరోలు పంజా వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ల సరసన నటించింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఉందంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓవైపు అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ల వేట జరుగుతోంది. ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేశారు. ఇక దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో మొత్తం 5గురు హీరోయిన్లను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే కేతికా శర్మ తన మనస్సుల్లోని మాటను బయటపెట్టింది. అల్లు అర్జున్ సరసన ఎలాంటి పాత్రలోనైనా జానర్ తో సంబంధం లేకుండా నటించేందుకు తాను సిద్ధమేనని ఓపెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కేతికా శర్మ నుంచి రాబోయే చిత్రాలు..
కేతికా శర్మ చివరిగా 'రాబిన్ హుడ్'తో అలరించింది. ఇక మే9న విడుదల కాబోతున్న శ్రీవిష్ణు #Single చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. చిత్రంలో శ్రీవిష్ణు సరసన నటించింది. మరో రెండు రెజుల్లో ఈ సినిమా ఫలితం తెలియనుంది. మరోవైపు రాజేశ్ ఎం సెల్వాస్ నుంచి రాబోతున్న చిత్రంలోనూ కేతికా హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. మున్ముందు ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ ల్లో అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X