‘అది ద సర్ ప్రైజ్’.. కేతికాతో అలాంటి స్టెప్పులా? వివాదంలో శేఖర్ మాస్టర్
టాలీవుడ్ స్టార్ నితిన్ త్వరలో రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి నితిన్ ఫేవరెట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండడం విశేషం. టాలీవుడ్ సెన్సేషన్, యంగ్ హీరోయిన్ శ్రీలీలా నితిన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సినిమాపై హైపును పెంచేందుకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ను వదులుతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఒకటి రిలీజ్ అయి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లు ఈవెంట్లను కూడా మేకస్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మరింతగా ప్రమోషన్స్ జోరును పెంచుతున్నారు. కాగా రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యంగ్ హీరోయిన్ కేతిక శర్మ స్పెషల్ డ్యాన్స్ లో నటించింది. అది ద సర్ప్రైజ్... అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ ఆ సాంగ్ వల్ల సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం. అదెలా అంటే ఈ సాంగ్లో కేతిక శర్మ తో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల మూలంగానే విమర్శలు వెలుగుతున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ లో కేతిక శర్మతో ధరింపచేసిన దుస్తులు, వేయించిన స్టెప్పులు కొందరికి అభ్యంతరంగా మారాయి. ముఖ్యంగా స్టేట్ విమెన్ కమిషన్ ఈ సాంగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక మహిళతో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏమాత్రం సబబని విమర్శించింది.
ఇలాంటి సాంగులకు ఫిలిం మేకర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ సాంగ్లో స్టెప్పులు ఏమాత్రం కూడా చూడదగినవిగా, ఆస్వాదించదగినగా లేవంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ పలుమార్లు తన కొరియోగ్రఫీ మూలంగా స్పెషల్ సాంగ్స్ లతో విమర్శల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే రాబిన్ హుడ్ చిత్రంలోను స్పెషల్ సాంగ్ కు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ విమర్శలను అందుకుంటుంది.
గతంలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కూడా ఇలానే విమర్శలను అందుకుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా దబిడి దిబిడి అనే స్పెషల్ సాంగ్ లో చిందులేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బాలయ్యతో వేసిన స్టెప్పులు ఏమాత్రం బాగాలేవని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడిచింది. ఆ సాంగ్ కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించింది కావడం గమనార్హం. ఇక రాబిన్ హుడ్ చిత్రం నుంచి మరో రెండు సాంగ్స్ కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న నితిన్ కు ఈ చిత్రం మంచి రిజల్ట్ అందిస్తుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











