Srinidhi Shetty: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ హీరోయిన్.. అది సాంప్రదాయమంటూ!
సాధారణ సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ఇండియా వైడ్ గా రికార్డులు నమోదు చేసింది. తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీ కేజీఎఫ్ 2 కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఒక్క సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయని శ్రీనిధి శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
జననం-విద్య:1991 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. ఆమె తండ్రి రమేష్ శెట్టి ముల్కి పట్టణానికి చెందినవాడు కాగా.. తల్లి కుశల తల్లిపాడు గుత్తు, కిన్నిగోలికి చెందినది. బెంగళూరులోలని జైన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా పొందిన శ్రీనిధి శెట్టి డిస్టింక్షన్ తో పట్టభద్రురాలైంది.

మోడలింగ్:ఉన్నతమైన చదువు తర్వాత మోడలింగ్ రంగంపై ఇంట్రెస్ట్ తో అందులోకి చేరింది ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. మిస్ కర్ణాటక 2015, మిస్ దివా సుప్రనేషనల్ 2016, మిస్ సుప్రనేషనల్ ఇండియా 2016 వంటి అవార్డ్స్ సైతం అందుకుని ఆశ్చర్యపరిచింది శ్రీనిధి శెట్టి.

పోటీలు-యాడ్స్:ఇవే కాకుండా ప్రతిష్టాత్మకమైన మిస్ సౌత్ ఇండియా 2015, మిస్ కర్ణాటక-మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మణప్పురం మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా, మిస్ కాంజినియాలిటీ మొదటి రన్నరప్, మిస్ దివా 2016 వంటి పోటీల్లో పాల్గొంది గ్లామరస్ బ్యూటి శ్రీనిధి శెట్టి. ఇలా మోడలింగ్ తర్వాత పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించి ఆకర్షించింది.

అలా ఎంట్రీ:ఇక కేజీఎఫ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ శాండల్ వుడ్ సుందరి శ్రీనిధి శెట్టి. రెండు ఇందులో రీనా దేశాయ్ పాత్రలో యువత మనసు దోచుకుంది ఈ సుందరాంగీ. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.
పారితోషికం పెంచి:పాపులర్ యాక్టర్ చియాన్ విక్రమ్ కు జోడీగా కోబ్రా సినిమాలో హీరోయిన్ గా చేసింది శ్రీనిధి శెట్టి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు. ఈ సినిమా తర్వాత శ్రీనిధి ఏ సినిమా చేయలేదు. అందుకు కారణం ఆమె భారీగా పారితోషికం పెంచడమే అని వార్తలు అయితే వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీనిధి పెళ్లి చేసుకుందని తాజాగా వార్తలు గుప్పుమన్నాయి.
సాంప్రదాయం:తాజాగా ఇన్ స్టాలో శ్రీనిధి షేర్ చేసిన ఫొటోల్లో నుదిటిన పాపిట్లో సింధూరంతో బొట్టు పెట్టుకుని కనిపించింది. సాధారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే ఇలా నుదుటన బొట్టు పెట్టుకుంటారు కాబట్టి.. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని జోరుగా చర్చ నడిచింది. అయితే కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సాంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాకుండా కూడా నుదుటన బొట్టు పెట్టుకుంటారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











