Srinidhi Shetty: KGF హీరోయిన్ బికిని అందాలు.. ఇలా చూస్తే మతిపోవాల్సిందే..
కన్నడ ఫ్యాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లను అందుకొని కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో కేజిఎఫ్ వీక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ వివరాల్లోకి వెళితే..

ఆమె ఎవరు?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో నటించిన హీరో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అందులో నటించిన హీరోయిన్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ఆమె ఎవరు ఎక్కడినుంచి వచ్చింది అనే సందేహాలు ప్రేక్షకుల్లో అయితే చాలానే ఉన్నాయి. ఆమె అసలు పేరు శ్రీనిధి రమేష్ శెట్టి.

రెండవ చాప్టర్ లో..
ఒక విధంగా కేజిఎఫ్ చాప్టర్ 1 లో కంటే కూడా రెండవ చాప్టర్ లోనే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగానే ఇచ్చారు. హీరో అలాగే ఇతర విలన్స్ డామినేషన్ ఎక్కువ కావడంతో హీరోయిన్ పాత్ర అంతగా హైలెట్ కాలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ క్లైమాక్స్ లో మాత్రం హీరోయిన్ చనిపోవడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే క్లిక్ అయ్యాయి. ఆ సన్నివేశాలతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి మంచి క్రేజ్ అయితే దొరికింది.

మోడలింగ్ ప్రపంచంలో..
ఇక శ్రీనిధి శెట్టి వివరాల్లోకి వెళితే.. శ్రీనిధి శెట్టి సినిమాల్లోకి రాకముందు మంచి మోడల్ గా కూడా గుర్తింపు అందుకుంది. ఆమె దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంది. కాకుండా మోడలింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో కిరీటాలు కూడా సొంతం చేసుకుంది.

మిస్ సుప్రానేషనల్
బెంగళూరుకు చెందిన శ్రీనిధి శెట్టి మొదట మిస్ కర్ణాటక కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ సుప్రానేషనల్ పోటీలలో కూడా శ్రీనిధి శెట్టి నెంబర్ వన్ స్థానంలో కిరీటాన్ని సొంతం చేసుకొని దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. కర్ణాటక రాష్ట్రంలో గత ఐదారేళ్లలో ఎక్కువగా మోడలింగ్ ప్రపంచంలో మంచి గుర్తింపును అందుకున్న అతి కొద్ది మంది మోడల్స్ లో శ్రీనిధి శెట్టి ఒకరు అని చెప్పవచ్చు.

బికినీ ఫొటోస్ వైరల్
శ్రీనిధి శెట్టి మోడలింగ్ ప్రపంచంలో చాలా సార్లు బికినీలో దర్శనం ఇచ్చింది. ఆమెకు సంబంధించిన చాలా రకాల బికినీ ఫోటోషూట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేజిఎఫ్ సినిమాలో పెద్దగా గ్లామర్ డోస్ లేకుండానే కనిపించిన శ్రీనిధి శెట్టి రియల్ లైఫ్ లో మాత్రం మోడలింగ్ ప్రపంచంలో చాలా సార్లు బికినీలో దర్శనం ఇచ్చింది. ఇక ఫోటోలను చూస్తున్న కుర్రాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ మోడల్ సినిమాల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











