ఖిలాడీ బ్యూటీకి తెలుగులో ఫైనల్ గా మాస్ ఆఫర్ .. ఈసారైనా హిట్ వరిస్తుందా?
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి లేదని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒకలా ఉన్న వారి పరిస్థితి రేపటికి తారు మారు అయ్యిపోతుంది. మెయిన్ గా హీరోయిన్స్ పరంగా ఇలాంటి ఆశ్చర్యకర పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండొచ్చు కానీ ఆ ఇద్దరికీ సరైన ఆఫర్స్ ఒకేలా మాత్రం ఉండవు.
ఇంకా చెప్పాలంటే అదొక ప్లాప్ సినిమా అయినప్పటికీ ఒక హీరోయిన్ కి వరుస ఆఫర్స్ ఒక హీరోయిన్ కి అరకొర ఆఫర్స్ మాత్రమే జరుగుతుంది. మరి దీనికి చక్కటి ఉదాహరణగా మాస్ మహారాజ రవితేజ ఖిలాడీసీ సినిమా బ్యూటీస్ మీనాక్షి చౌదరి అలాగే డింపుల్ హయతిల కోసం చెప్పొచ్చు. ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ చూపించిన అందాల ఆరబోత అంతా ఇంతా కాదు.

అలా ఒక్కసారిగా తెలుగులో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ హాట్ బ్యూటీస్ లో మీనాక్షి చౌదరీ వరుస ఆఫర్స్ తో దూసుకెళ్ళిపోతే చాక్లెట్ బ్యూటీగా అనిపించుకున్న డింపుల్ హయాతి మాత్రం దారుణంగా స్ట్రగుల్ అయ్యింది. కాగా ఇద్దరూ ప్లాప్ సినిమా తోనే ఎంట్రీ అయ్యారు. పైగా తమ గ్లామ్ షో కూడా సమానమే అయినప్పటికీ తెలుగులో ఎక్కువగా మీనాక్షి చౌదరి క్లిక్ అయ్యింది.
కానీ డింపుల్ మాత్రం అండర్ రేటెడ్ లోకి వెళ్ళిపోయింది. కాగా మీనాక్షి చౌదరి చేసిన ఈ కొన్ని సినిమాల్లో ఒకటి హిట్ ఒకటి ప్లాప్ ఇలా ట్రాక్ రికార్డు మైంటైన్ చేస్తుండగా డింపుల్ మాత్రం కేవలం రెండు సినిమాలు అది కూడా రెండు ఒకదాన్ని మించిన మరొకటి ప్లాప్ గా నిలిచిపోయాయి. ఖిలాడీ తర్వాత మ్యాచో హీరో గోపీచంద్ తో చేసిన రామబాణం మరింత డిజాస్టర్ అయ్యింది. ఇక అక్కడ నుంచి మరో సినిమా తనకి దక్కలేదు.
మరి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఫైనల్ గా డింపుల్ కి తెలుగులో ఓ మాస్ ఆఫర్ దక్కింది. కాగా ఈసారి యంగ్ హీరో శర్వానంద్ అలాగే రచ్చ, సీటీమార్ సినిమాల దర్శకుడు రీసెంట్ గా తమన్నాతో ఓదెల 2 చేసిన సంపత్ నంది కలయికలో తెరకెక్కిస్తున్న సినిమా 'భోగి'లో మరో హీరోయిన్ గా ఈ చాక్లెట్ బ్యూటీ పేరు కూడా బయటకొచ్చింది. ఇలా కొంచెం గ్యాప్ తీసుకుంటే తీసుకుంది కానీ గట్టి సినిమా తోనే ఆమె వచ్చేలా ఉందని చెప్పవచ్చు.
మరి ఈ సినిమాతో అయినా టాలీవుడ్ లో మొదటి హిట్ ఆమెని వరిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. అన్నట్టు ఈ సినిమాలో ఈమె ఒకరు మాత్రమే హీరోయిన్ కాదు. మరో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా నటిస్తుంది అని మేకర్స్ తెలిపారు. సో ఇందులో మొత్తం ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మరి తెలుగులో వీరికి ఈ సినిమా ఏ మేర హిట్ అందిస్తుందో చూడాల్సిందే.
కాగా ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో అనౌన్స్ చేయగా శర్వానంద్ నుంచి కూడా తొలి పాన్ ఇండియా సినిమాగా ఇది రాబోతుంది. సో ఈ చిత్రం ఒక్క డింపుల్ హయాతికి మాత్రమే కాకుండా శర్వానంద్ పాన్ ఇండియా ఎంట్రీకి కూడా కీలకం అని చెప్పవచ్చు. కాగా షూటింగ్ ని ఇటీవల మొదలు పెట్టుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదలకి ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











