నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
ఒక్కసారిగా సినిమా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన రోజుకో స్థాయిలో మీడియాలో వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ కి ఈ ఏడాది ఆర్థికంగానే కాకుండా మానసిక వేదనను కలిగిస్తోందనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో డిప్రెషన్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ డిప్రెషన్ ని కూడా దాటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడి వల్ల సీనియర్ నటి ఖుష్బూ కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట.

డిప్రెషన్
ఒక మనిషి జీవితంలో డిప్రెషన్ అనే పదం చాలా కామన్ గా మారింది. స్థాయిని బట్టి మనిషి విలువపై లెక్కలు వేసే ప్రపంచం పోకడను మనిషి కొన్నిసార్లు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మనిషిలో పరాజయం అనే పదం భారంగా మారుతోంది. ఈ కాలంలో టీనేజ్ వయసు నుంచే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అంటే డిప్రెషన్ అనే పదం ఎంత కఠినంగా మరిందో అర్థం చేసుకోవచ్చు.

ఆత్మహత్య చేసుకోవాలని
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. సుశాంత్ మరణవార్తపై స్పందించిన ఆమె సోషల్ మీడియా ద్వారా డిప్రెషన్ అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకువెళుతోంది అనే విషయాన్ని వివరంగా పేర్కొన్నారు. ఎంతో మానసిక ఒత్తిడిని నా జీవితంలో చూశాను అని ఆమె తెలిపారు.

ప్రతి మనిషిలో ఉంటుంది
ఖుష్బూ ఈ విదంగా తెలియజేస్తూ.. ప్రతి మనిషిలో మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. అలా లేదు అని వారు చెబుతున్నారు అంటే వాళ్ళు అబద్ధం చెబుతున్నట్లు లెక్క. నేను కూడా చాలా సార్లు డిప్రెషన్ కి గురయ్యాను. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. కానీ సమస్యలకు అది పరిష్కారం కాదని ధైర్యంగా మానసిక ఒత్తిడిలను తట్టుకొని పోరాడాలని అనుకున్నాను.
Recommended Video

కరెక్ట్ కాదని..
ఒక సందర్భంలో నా జీవితం ఆగిపోయింది అనిపించింది. నా ఒత్తిడి వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాను. కానీ నా నా స్నేహితులు దేవధూతల్లా కనిపించారు. నాకు ఎంతో సపోర్ట్ చేసి ధైర్యం నింపారు. అనంతరం సమస్యల కారణంగా విలువైన జీవితాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదని అనిపించింది. ఎన్ని సమస్యలు వచ్చినా అపజయాలు వచ్చినా బేధరకుండా వాటిని విజయాలుగా మార్చుకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నాను అని ఖుష్బూ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











