స్విమ్ సూట్‌లో స్టార్ హీరోయిన్ చెల్లెలు .. ఆ పార్ట్‌పై టాటూ చూపిస్తూ , మరీ ఇంత హాట్‌గానా?
అతిలోక సుందరి, స్వర్గీయ శ్రీదేవీ కూతురిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఖుషీ కపూర్. సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో కనిపిస్తుంటుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. ఏ స్టార్ హీరోయిన్‌లకు కూడా లభించని క్రేజ్ ఈ భామకు లభించిందింది. తల్లిదండ్రులు, అక్క జాన్వీ కపూర్‌ల ఇమేజ్ దీనికి కొంత వరకు కారణం కావొచ్చు. తాజాగా మాల్దీవుల్లో బీచ్‌లలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది ఖుషీ కపూర్. ఆ వివరాల్లోకి వెళితే..
అతిలోక సుందరి వారసురాలిగా జాన్వీ కపూర్ తల్లి పేరును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌లో తనేంటో రుజువు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన దేవరలో ఆమె హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్‌లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ అదిరిపోతుందని ఫిలింనగర్ టాక్.

శ్రీదేవి పెద్ద కూతురు ఇండస్ట్రీలో క్లిక్ అవ్వగా.. చిన్న కూతురు ఖుషీ కపూర్ సైతం పరిశ్రమలో అడుగుపెట్టారు. 2016లో భష్మ్ హో ప్యార్ కా తక్రార్, 2020లో స్పీక్ అప్ అనే షార్ట్ ఫిలింస్‌లో నటించి అదృష్టం పరీక్షించుకున్నారు. 2023లో జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ది అర్కీస్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో ఆమెది ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కాదు. ప్రస్తుతం నాదానియన్, యునైటెడ్ రొమాంటిక్ కామెడీ సినిమాలలో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఒక్క సినిమాలో కూడా హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్‌లో నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఖుషీ కపూర్. ఇక అక్క జాన్వీ కపూర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రేమాయాణాలు సాగించడంలో ఖుషీ కూడా బాగా ముదిరిపోయిందని అంటున్నారు. తన మిత్రుడు వేదాంగ్ రైన్‌తో ఆమె ప్రేమలో పడినట్లుగా బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. వారిద్దరూ కలిసి ఇటీవల రిలీజై వెబ్ సిరీస్ ది ఆర్చీస్ లో కలిసి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగు సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి రిలేషన్ వరకు వెళ్లిందని అందరూ చెప్పుకొంటారు.
అయితే వారిద్దరూ చాటుమాటుగా ఈ రొమాంటిక్ మూవెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వేదాంగ్ రైనా ఇటీవల ఆలియా భట్‌తో కలిసి జిగ్రా మూవీలో నటించాడు. ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఆయనకు కూడా ఈ సినిమా వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నటుడిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు కెరీర్‌పైన దృష్టి పెడుతూనే ఖుషితో ప్రేమాయణాన్ని కూడా కొనసాగిస్తున్నాడు.
నిన్న మొన్నటి వరకు జిగ్రా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న వేదాంగ్ రైనాకు తీరిక దొరకడంతో ఖుషితో కలిసి మాల్దీవుల్లో దిగారు. అయితే వెకేషన్ సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేయగా.. ఆయన రొమాంటిక్ వ్యవహారం బయటపడింది. ఇక బ్లాక్ స్విమ్ షూట్ ధరించి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఖుషీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛాతీ, చేయిపై వేసుకున్న టాటూలతో ఖుషీ అందం మరింత రెట్టింపు అయ్యింది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ హాట్ ఫోటోలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











