ఆ విషయాన్ని చెప్పడానికి భయమెందుకు? ప్లాస్టిక్ సర్జరీపై శ్రీదేవి కుమార్తె కామెంట్స్..
సినీ ఇండస్ట్రీ అనేది గ్లామర్ ప్రపంచం. సెలబ్రెటీలు తాము అందంగా కనిపించడం కోసం ఎంతో శ్రద్ద చూపుతారు. అయితే.. కొంతమంది నటులు తమ అందాన్ని పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తుంటారు. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. ఇప్పటికే చాలామంది నటులు తమ అందానికి మెరుగులు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుంటారు. ఈ జాబితాలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అయితే కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయట పడకుండా జాగ్రత్త పడితే.. మరికొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.
ప్లాస్టిక్ సర్జరీపై షాకింగ్ కామెంట్స్ చేసిందో ఎవరో కాదు. అందాల తార శ్రీదేవీ గారల పట్టి ఖుషి కపూర్. అలనాటి అందాల నటి శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల ముద్దుల కూతురు ఖుషీ కపూర్. ఈ అమ్మడు కూడా వరుస సినిమాలతో బాలీవుడ్ ను ఏలుతోంది. అయితే.. ఈ ముద్దుగుమ్మ డేటింగ్ వార్తలు సంబంధించిన రోజులుగా చాలా రోజులుగా వస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై ఆమె ఎప్పుడు కూడా స్పందించలేదు. ఆ విషయాన్ని బయటపెట్టలేదు.

ఇదిలాఉంటే.. ఖుషీ కపూర్, ఆమిర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'లవ్‌యాపా' (Love Yapa). యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీవచ్చే నెల ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ లో థియేటర్లలో విడుదల కాబోతుంది.ఇక ప్రమోషన్‌లో భాగంగా ఖుషి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రమోషన్స్ ఇంటర్య్వూలో ఖుషి కపూర్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. వాస్తవానికి అందులో తప్పు ఏముంది. ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు భయమేందుకు.. నాకు మాత్రం అలాంటి ఇబ్బందేమి లేదు. నేను మాత్రం అలాంటి విషయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తాను. అవమానంగా భావించాల్సిన విషయం ఏముంది.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అంతేకాకుండా.. ''ప్లాస్టిక్ సర్జరీ అనేది నా దృష్టిలో మ్యాటరే కాదు. అందులో ప్లాస్టిక్ అనే పదం మాత్రమే చూస్తాను. పక్కవారిని నిందించేందుకు దీనిని సాకుగా చూస్తారు. తాను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే తనపై కూడా ఎన్నో ఊహాగానాలు వచ్చాయని, అందులో ఎక్కువ శాతం నెగెటివ్‌గానే ఉన్నాయని అని చెప్పారు. తాను లిప్ ఫిల్లర్స్ వేయించుకున్నట్టు కూడా తెలిపింది. 2023లో ద ఆర్చీస్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుషీ ప్రస్తుతం లవ్‌యాపా అనే సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











