For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భరత్ అనే నేను ఆఫర్ అలా వచ్చింది.. మహేష్ పక్కన నటించమని నమ్రత.. కియారా అద్వాని

|

అందాల తార కియారా అద్వానీ ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత చకచకా ఎంఎస్ ధోని, మెషిన్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను సినిమా ఆఫర్‌ను పట్టేసింది. ఆ సినిమా హిట్ కావడంతో కియారా అదృష్ట రేఖ మారిపోయింది. ప్రస్తుతం వినియ విధేయ రామ, కాలాంక్, కబీర్ ఖాన్, గుడ్ న్యూస్ సినిమాల్లో నటిస్తున్నది. అయితే భరత్ అనే నేను ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని కియారా వివరించారు. ఆమె చెప్పిన విషయం ఏమిటంటే..

ఎంఎస్ ధోని మూవీ చూసి

ఎంఎస్ ధోని మూవీ చూసి

2018 సంవత్సరం నన్ను, నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అంతకు ముందు ఎంఎస్ ధోని నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. భరత్ అనే నేను సినిమాతో నా కెరీర్ పరుగులు పెట్టింది. ఎంఎస్ ధోని తర్వాత కొరటాల శివ నన్ను సంప్రదించారు.

 నమ్రత శిరోద్కర్ ఫోన్ చేసి

నమ్రత శిరోద్కర్ ఫోన్ చేసి

వాస్తవానికి నేను ఎంఎస్ ధోని సినిమా చేయడానికి ముందే నమ్రత శిరోద్కర్ నన్ను తెలుగు సినిమాలో నటించాలని అడిగింది. అప్పుడు నాపై నాకే కాన్ఫిడెన్స్ లేదు. ధోని మూవీ తర్వాత నాలో నాకు ధైర్యం వచ్చింది. కొరటాల శివ, నమ్రత నన్ను సంప్రదించడంతో ఒప్పేసుకొన్నాను. మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో నటించే అవకాశం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి. అందుకే మరోమారు ఆలోచించలేదు.

 భరత్ అనే నేను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్

భరత్ అనే నేను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్

భరత్ అనే నేను చిత్రం నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. హిందీ ప్రేక్షకులు, ప్రముఖులు చూసి మెచ్చుకొన్నారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోనేందుకు భరత్ అనే నేను సినిమాలో స్క్రీన్ టైమ్ కూడా దక్కింది. దాంతో నేనేంటో నాకు బాగా తెలిసింది. అప్పటి నుంచి నేను వెనుక తిరిగి చూసుకోలేదు.

బాహుబలితో నా అభిప్రాయం మారింది

బాహుబలితో నా అభిప్రాయం మారింది

హిందీ పరిశ్రమలో రాణించలేని హీరోయిన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారనడం సరికాదు. నాకు ప్రాంతీయపరమైన బేధాలు లేవు. మంచి సినిమాలు చేయాలనే చూస్తాను. బాహుబలి తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమకు మంచి క్రేజ్ లభించింది. అలాంటి చోట ఆఫర్లు రావడం గొప్పగా భావిస్తాను. భాష అనేది సమస్య కాదని బాహుబలి సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చింది.

English summary
Most talented actress Kiara Advani is going with great Phase in film Industry. After MS Dhoni, She gained popularity in Bollywood. Now she has don Vinaya Videya Rama with Ram Charan. this movie is set to release on January 11th. So she spoke to Telugu filmibeat. She revealed that how Bharat ane nenu offer comes to her.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more