Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
భరత్ అనే నేను ఆఫర్ అలా వచ్చింది.. మహేష్ పక్కన నటించమని నమ్రత.. కియారా అద్వాని
అందాల తార కియారా అద్వానీ ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత చకచకా ఎంఎస్ ధోని, మెషిన్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను సినిమా ఆఫర్‌ను పట్టేసింది. ఆ సినిమా హిట్ కావడంతో కియారా అదృష్ట రేఖ మారిపోయింది. ప్రస్తుతం వినియ విధేయ రామ, కాలాంక్, కబీర్ ఖాన్, గుడ్ న్యూస్ సినిమాల్లో నటిస్తున్నది. అయితే భరత్ అనే నేను ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని కియారా వివరించారు. ఆమె చెప్పిన విషయం ఏమిటంటే..
ఎంఎస్ ధోని మూవీ చూసి
2018 సంవత్సరం నన్ను, నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అంతకు ముందు ఎంఎస్ ధోని నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. భరత్ అనే నేను సినిమాతో నా కెరీర్ పరుగులు పెట్టింది. ఎంఎస్ ధోని తర్వాత కొరటాల శివ నన్ను సంప్రదించారు.
నమ్రత శిరోద్కర్ ఫోన్ చేసి
వాస్తవానికి నేను ఎంఎస్ ధోని సినిమా చేయడానికి ముందే నమ్రత శిరోద్కర్ నన్ను తెలుగు సినిమాలో నటించాలని అడిగింది. అప్పుడు నాపై నాకే కాన్ఫిడెన్స్ లేదు. ధోని మూవీ తర్వాత నాలో నాకు ధైర్యం వచ్చింది. కొరటాల శివ, నమ్రత నన్ను సంప్రదించడంతో ఒప్పేసుకొన్నాను. మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో నటించే అవకాశం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి. అందుకే మరోమారు ఆలోచించలేదు.
భరత్ అనే నేను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్
భరత్ అనే నేను చిత్రం నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. హిందీ ప్రేక్షకులు, ప్రముఖులు చూసి మెచ్చుకొన్నారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోనేందుకు భరత్ అనే నేను సినిమాలో స్క్రీన్ టైమ్ కూడా దక్కింది. దాంతో నేనేంటో నాకు బాగా తెలిసింది. అప్పటి నుంచి నేను వెనుక తిరిగి చూసుకోలేదు.
బాహుబలితో నా అభిప్రాయం మారింది
హిందీ పరిశ్రమలో రాణించలేని హీరోయిన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారనడం సరికాదు. నాకు ప్రాంతీయపరమైన బేధాలు లేవు. మంచి సినిమాలు చేయాలనే చూస్తాను. బాహుబలి తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమకు మంచి క్రేజ్ లభించింది. అలాంటి చోట ఆఫర్లు రావడం గొప్పగా భావిస్తాను. భాష అనేది సమస్య కాదని బాహుబలి సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చింది.