నా ప్రియుడు చీటింగ్ చేస్తే.. ఏం చేస్తానో తెలుసా? కియారా అద్వానీ షాకింగ్ కామెంట్
బాలీవుడ్‌లో కెరీర్‌తోపాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఎంజాయ్ చేస్తున్నది. ప్రియుడితో విహార యాత్రలతో హల్‌చల్ చేస్తున్నది. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన ప్రొఫెషనల్, పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడించింది. కియారా అద్వానీ తన ప్రియుడి గురించి ఏం చెప్పారంటే..

ప్రియుడితో విదేశాల్లో విహారయాత్ర
కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం ఆరంభంలో బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని మాల్దీవులకు వెళ్లారు. వారిద్దరు అక్కడ చేసిన రొమాంటిక్ మూమెంట్స్ అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి. వారిద్దరి అఫైర్ విషయం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది.

కొత్త ఏడాదిని సంతోషంగా
అయితే సిద్ధార్థ్‌తో రిలేషన్ గురించి కియారా మాట్లాడుతూ.. కొద్దికాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటున్నాను. మేమిద్దరం ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు విహారయాత్ర చేశాం. కొత్త సంవత్సరాన్ని చాలా గ్రాండ్, ఫన్నీగా మొదలుపెట్టాం. మా ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం గురించి దాచాల్సిన అవసరం లేదు అంటూ కియారా అద్వానీ పేర్కొన్నది.

ప్రియుడు చీట్ చేస్తే...
ఒకవేళ నీ ప్రియుడు నిన్న చీట్ చేసి మోసగిస్తే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అలాంటి పనికి పాల్పడితే వెంటనే మొబైల్‌లో బ్లాక్ చేస్తాను. ఇక అతడి ముఖం జన్మలో చూడను. అతడు చేసిన మోసాన్ని ఎప్పటికీ మర్చిపోను. అతడితో ఎలాంటి సంబంధాలు పెట్టుకొను అంటూ కియారా తన మనసులోని మాటను చెప్పారు.

కియారా అద్వానీ 2021 కెరీర్
కియారా అద్వానీ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో సినిమా పరిశ్రమ స్తంభిస్తే.. ఈ భామ సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి. 2020లో గిల్టీలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాగా, అగ్రేజీ మీడియం, మసాబా బాసాబా వెబ్ సిరీస్, లక్ష్మీ, ఇందూ కి జవాన్ రిలీజ్ అయ్యాయి. 2021లో కూడా షేర్షా, భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











