పిల్లల డైపర్లు కూడా మార్చాను... కష్టపడితేనే ఆఫర్లు.. నెపోటిజంపై కియారా అద్వానీ

బాలీవుడ్, తెలుగు సినిమాల విజయాలతో అగ్రతారగా కియారా అద్వానీ గుర్తింపు పొందారు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే భరత్ అనే నేను, వినయ విధేయ రామ, హిందీలో గుడ్ న్యూస్, కబీర్ సింగ్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర విజయాల కారణంగా మరిన్నీ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అక్షయ్ కుమార్‌తో కలిసి లక్ష్మీ బాంబ్‌లో నటించిన కియారా అద్వానీ.. ఆ సినిమా రిలీజ్ ముందు మీడియాతో మాట్లాడుతూ..

సినిమా కుటుంబం నుంచి వచ్చినా..

సినిమా కుటుంబం నుంచి వచ్చినా..

నాకు ఫిల్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నా కెరీర్‌కు ఎప్పుడూ ఉపయోగపడలేదు. నేను సినిమా పరిశ్రమలోకి వచ్చేంత వరకు అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉందనే విషయం నాకు తెలియదు. నా కెరీర్‌లో ఇప్పటి వరకు తెలుసుకొన్నదేమిటంటే.. మన ప్రతిభతోనే ఆఫర్లు అందుకోవాలి తప్ప.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో నిలదొక్కుకోలేం అని కియారా అద్వానీ అన్నారు.

ప్రతిభతోనే ఆఫర్లు..

ప్రతిభతోనే ఆఫర్లు..


నేను సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే సయిద్ జాఫ్రీ, అశోక్ కుమార్ లాంటి దిగ్గజాలు నా ఫ్యామిలీలో ఉన్నారని తెలిసింది. నేను నటించిన ప్రాజెక్టుల్లో నా ఫెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలకడం వల్లే నాకు మంచి ఆఫర్లు వచ్చాయని భావిస్తాను. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ను చూసి ఎవరూ ఆఫర్లు ఇవ్వరనేది నా అభిప్రాయం అని కియారా పేర్కొన్నారు.

కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సక్సెస్‌లతో

కబీర్ సింగ్, గుడ్ న్యూస్ సక్సెస్‌లతో

కబీర్ సింగ్, గుడ్ న్యూస్ లాంటి సినిమాలు నాకు గుర్తింపును అవకాశాలను తెచ్చిపెట్టాయి. రెండు ఢిఫరెంట్ రోల్స్, రెండు విభిన్నమైన చిత్రాలు వెంటవెంటనే లభించడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఆ విషయంలో లక్కీగా ఫీలవుతాను. కష్టించి పనిచేయడం, సక్సెస్‌ను దేవుడికే వదిలేయడం చేస్తాను అని కియారా తెలిపారు.

లస్ట్ స్టోరీస్‌లో ఎందుకు నటించానంటే

లస్ట్ స్టోరీస్‌లో ఎందుకు నటించానంటే


లస్ట్ స్టోరీస్‌లో నటించడంపై గొప్ప అవకాశమే. కరణ్ జోహర్ నుంచి ఆఫర్ రాగానే మరోమాటు ఆలోచించకుండా అంగీకరించాను. కరణ్ జోహర్ డైరెక్షన్‌లో నటించడం కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని భావించాను. ఆ విధంగానే లస్ట్ స్టోరీస్ నా కెరీర్‌కు బాగా ఉపయోగపడింది అని కియారా అద్వానీ అభిప్రాయపడ్డారు.

Recommended Video

#SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
మాతృత్వం అనే గొప్ప భావన

మాతృత్వం అనే గొప్ప భావన


నాకు మాత్వత్వం అనే విషయంపై చాలా గౌరవం ఉంది. మహిళల జీవితంలో అదో అపురూపమైన ఘట్టం. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చిన్న పిల్లలకు డైపర్లు మార్చడం చేస్తుంటాను. సమయం చిక్కితే నా కుటుంబంలో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకొంటాను. పిల్లలతో గడపడం చాలా హ్యాపీగా ఉంటుంది. వారిలో నిజాయితీ కనిపిస్తుంటుంది. వారితో ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది అని కియారా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X