హిందీ ‘అర్జున్ రెడ్డి’లో ఆవిడే.... ఏం రేంజిలో రెచ్చిపోతుందో?
Recommended Video

తెలుగులో సంచలన విజయం అందుకున్న 'అర్జున్ రెడ్డి' ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ ప్లాన్ చేస్తున్నారు.
vote for your favourite bigg boss contestant here
తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌ను కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి హీరోయిన్‌గా కియారా అద్వానీని ఫైనలైజ్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాకు ఫస్ట్ ఆప్షన్ కియారా అని సందీప్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆగస్టులోనే ఆమెతో సంప్రదింపులు జరుపుగా డేట్స్ అడ్జెస్ట్ కాలేక తారా సుతారియాను తీసుకోవాలనుకున్నారు. ఇపుడు తారా సుతారియా తప్పుకోవడంతో.... కియారా డేట్స్‌కు అనుగుణం మార్పులు చేసి ఆమెనే ఫైనలైజ్ చేశారు.

కియారా బోల్డ్‌గా రెచ్చిపోవడం ఖాయం
‘అర్జున్ రెడ్డి'లో బోల్డ్ సీన్లు ఏ రేంజిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. తెలుగులోనే ఇలా ఉంటే... హిందీలో ఇంకాస్త డోస్ పెంచడం ఖాయం. ‘లస్ట్ స్టోరీ' లాంటి వాటిలో బోల్డ్ సీన్లతో అందరినీ ఆశ్చర్య పరిచిన కియారా అద్వానీ హిందీ ‘అర్జున్ రెడ్డి'లో ఏ స్థాయిలో రెచ్చిపోతోందో? అనే చర్చ మొదలైంది.

అన్ని షేడ్స్ చూపించే ఛాన్స్
ఈ పాత్ర చేయడంపై కియారా స్పందిస్తూ.... ‘తన కెరీర్లో ఇది మోస్ట్ చాలెజింగ్ రోల్ అవుతుంది. నా ఫేవరెట్ చిత్రాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. హీరోయిన్ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఇలాంటి పాత్ర చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.' అన్నారు.

కియారా లస్ట్ స్టోరీస్
కియారా అద్వానీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా.... ఆమెకు ఊహించని పబ్లిసిటీ, పేరు, గుర్తింపు తెచ్చింది మాత్రం ‘లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్. దీని తర్వాత దర్శక నిర్మాతలంతా తమ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉంటే కియారాతో చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ...
అయితే తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది కియారా. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌సి12 చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ..... అక్టోబర్ నుండి ‘అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్‌లో జాయిన్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











