Cannes 2024 అత్యంత ఖరీదైన నెక్లెస్‌తో కియారా అద్వానీ జిగేల్.. దాని ధర ఎంతో తెలుసా?
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే అందులో ఆమె వేసుకున్న నెక్లెస్ కాస్ట్ గురించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది. మరి కియారా నెక్లెస్ ధర ఎంతో తెలుసుకుందాం పదండి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్‌లో పాల్గొన్న కియారా అద్వానీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా కేన్స్ 2024 సినిమా గాలా డిన్నర్‌లో పింక్ అండ్ బ్లాక్ రంగులలో అద్భుతమైన ఆఫ్-షోల్డర్ సిల్క్ గౌనులో కనిపించింది.
ఈ కోర్సెట్ గౌన్ ను చాలా సాఫ్ట్ శాటిన్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. ఆఫ్ షోల్డర్ నెక్‌లైన్, బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ లాంగ్ స్లీవ్స్, బ్లాక్ వెల్వెట్ ఫిష్ టెయిల్ అండ్ పైభాగంలో శాటిన్ పింక్ డిజైన్‌లు గౌనును ప్రత్యేకంగా నిలబెట్టాయి.గులాబీ రంగు శాటిన్ ఫ్యాబ్రిక్‌లో డిజైన్ చేసిన ఫ్లవర్ పెద్ద కూడా గౌను వెనుక భాగంలో కుట్టారు. ఈ గౌనును టర్కీకి చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ నెట్రెట్ తసిరోగ్లు డిజైన్ చేసింది. దీనితో పాటు కియారా హై బన్ హెయిర్, న్యూడ్ గులాబీ రంగులో మేకప్‌ని వేసుకుని అద్భుతంగా కన్పించింది.

యువరాణిలా దుస్తులు ధరించిన కియారా మెడలో ఉన్న ఖరీదైన నెక్లెస్ కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. చియారా ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ అయిన బల్గారి నెక్లెస్ ధరించింది. పసుపు రాళ్లతో పొదిగిన డైమండ్-క్రస్ట్ ఇంటర్లేస్డ్ నెక్లెస్ అది.దీంతో అందరూ ఆమె నెక్లెస్ కాస్ట్ ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు. కియారా కేన్స్ లో వేసుకున్న ఆ నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్ళబెట్టడం ఖాయం. అది దాదాపు 30 కోట్ల రూపాయల విలువైన నెక్లెస్ అని సమాచారం.

ఈ నెక్లెస్ ను అమ్మితే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాంతం హ్యాపీగా బతికేవచ్చు అంటున్నారు దీని కాస్ట్ తెలుసుకున్న నెటిజన్లు.కాగా కియారా మొదటి రోజు హై స్లిట్‌తో ఐవరీ కలర్ దుస్తుల్లో వచ్చింది. ఈ దుస్తులకు రెండు వేర్వేరు స్లీవ్‌లు ఉన్నాయి. కియారా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో తన కేన్స్ లుక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.ప్రస్తుతం కియారా మూడు సినిమాల్లో నటిస్తోంది. గేమ్ ఛేంజర్, వార్ 2తో పాటు డాన్ 3 అనే మరో హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బాలీవుడ్ భామ.


Click it and Unblock the Notifications











