Kiara Advani ప్రియుడితో బ్రేకప్.. పెళ్లి పీటలకు వచ్చిన అఫైర్‌కు గుడ్‌బై
టాలీవుడ్‌లో మెరిసిన బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ, సిద్దార్థ మల్హోత్రా డేటింగ్, అఫైర్ వ్యవహారం హిందీ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అనేది అందరికి తెలిసిందే. అయితే వారిద్దరూ పెళ్లికి సిద్దమవుతున్నారనే వార్తలు అభిమానులను ఆనందానికి గురిచేశాయి. అయితే ప్రస్తుతం కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హ్రోత్రా అఫైర్ బ్రేకప్ అయిందనే వార్త ఇప్పుడు ముంబై మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. కియారా అద్వానీ బ్రేకప్ వెనుక కారణాలు ఏమిటంటే..

సిద్దార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్న సమయంలో షెర్షా అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్లు అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఆ సమయంలో వారిద్దరూ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చేసిన హంగామా మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాయి.

మాల్దీవుల్లో ఫుల్ రొమాన్స్
ఇక మాల్దీవుల పర్యటనలో కియారా, సిద్దార్థ్ రొమాన్స్ సోషల్ మీడియాలో హల్ చేసింది. మాల్దీవుల్లో వారి పర్యటన ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. వారిద్దరి మధ్య విడదీయలేనటువంటి అనుబంధం ఉందనే విషయాన్ని స్నేహితులు చెప్పుకొన్నారు.

షేర్షా మూవీ ప్రమోషన్స్‌లో
అయితే షేర్షా మూవీ ప్రమోషన్‌లో కియారాతో డేటింగ్ విషయంపై సిద్దార్థ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చాడు. మా జీవితాలు, మా బంధం సినిమా పరిశ్రమకు అతీతంగా ఉన్నాయి. ఆ కారణంగానే మేము, మా మనసులు దగ్గరయ్యాయి. అందుకే మేము కలిసి ఉండాలని అనుకొన్నాం అని సిద్దార్థ్ మల్హోత్రా చెప్పారు.

పెళ్లి వరకు వచ్చిన ప్రేమకు బ్రేకులు
బాలీవుడ్ మీడియాలో కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఒక దశలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకొన్నాయి. అయితే అలాంటి వార్తలకు భిన్నంగా కియారా, సిద్దార్థ్ విడిపోయారనే వార్తలు ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు.

విధి మరోలా నాటకం ఆడిందంటూ..
కియారా అద్వానీ బ్రేకప్ గురించిన విషయాన్ని స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు అని బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే అంతా ఒకటి తలంచితే.. విధి మరోలా నాటకం ఆడింది. వారి మధ్య ఉన్న విభేదాలను వారు పరిష్కరించుకొంటారని ఆశిస్తున్నాం అని సన్నిహితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











