ఆయన ‘హస్త ప్రయోగం’ చేయమన్నాడు.. అందుకే చేశా.. వల్గర్‌ ఏముంది.. క్లియారా అద్వానీ

Recommended Video

Kiara Adwani Sensational Comments On Lust Stories Movie Scene || Filmibeat Telugu

బాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలోనూ అందాల భామ కియారా అద్వానీ టాప్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్నది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ‌తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. కేవలం సినిమాలకే పరిమితంగా కాకుండా వెబ్ ‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నది. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు సెన్సేషనల్‌గా మారాయి. ఇటీవల కియారా మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని కీలక విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

 కరణ్ జోహర్ నా గురువు

కరణ్ జోహర్ నా గురువు

నా సినీ కెరీర్ ఈ రేంజ్‌లో ఉందంటే.. అందుకు కారణం బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్. ఆయనను నేను గురువుగా భావిస్తాను. అద్భుతమైన పాత్రలు ఇచ్చిన నా కెరీర్‌ను మలుపుతిప్పారు. అతను ఏదైనా సలహా ఇస్తే.. చాలా సీరియస్‌గా ఆలోచిస్తాను. దానిని పాటిస్తాను కూడా. అతను చెప్పేది నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తాను. నచ్చలేదని చెబితే సానుకూలంగా వింటాడు. అతనిలో ఇగో లేకపోవడం నాకు బాగా నచ్చింది అని కియారా అన్నారు.

 లస్ట్ స్టోరీస్‌లో హస్తప్రయోగం

లస్ట్ స్టోరీస్‌లో హస్తప్రయోగం

లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సీరిస్‌లో హస్తప్రయోగం సీన్ వివాదం కావడంపై స్పందించారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు చాలా నిజాయితీగా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చెప్పినప్పుడు నాకు ఎలాంటి ఆందోళన కలుగలేదు. కరణ్ జోహర్ ఆ సీన్ ఎంత సృజనాత్మకంగా తీస్తాడో అనే విషయం నాకు తెలుసు కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. తెర మీద హస్త ప్రయోగం సీన్ చూసినప్పుడు వల్గర్‌గా అనిపించలేదు అని కియారా తెలిపారు.

అమాయకత్వంతో కూడిన పాత్ర కావడంతో

అమాయకత్వంతో కూడిన పాత్ర కావడంతో

లస్ట్ స్టోరిస్‌లో అమాయకత్వంతో కూడిన పాత్రపై సానుభూతి పెరిగింది. అందుకే హస్త ప్రయోగం సీన్‌లో అశ్లీలత ఏదీ కనిపించలేదు. ఒకవేళ ఆ సీన్ నచ్చకపోతే సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా వచ్చేవి. కానీ ఇప్పటి వరకు అలాంటివి కనిపించలేదు. ఈ సీన్ చేయడానికి ముందు నా తల్లిదండ్రులకు చెప్పాను. ఎందుకంటే హఠాత్తుగా చూసి వాళ్లు షాక్ తినకూడదని అంతా చెప్పేశాను అని కియారా వెల్లడించారు. .

 ఫలానా అనే ముద్ర పడలేదు

ఫలానా అనే ముద్ర పడలేదు

నా కెరీర్‌ సవ్యంగా సాగడం ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభంలో ఒకే రకమైన పాత్రలు లభించకపోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా డ్రస్పింగ్, వేషధారణ చూసి నన్ను అందరూ గ్లామరస్ అనుకొంటారు. కానీ నేను వేసిన పాత్రలకు, నా అందానికి సంబంధం లేదు. నేను ఫలానా పాత్రలకే సరిపోతారనే ముద్ర వేయకపోవడం లక్కీగా భావిస్తా. నాకు అదే కొండంత అండ అని భావిస్తాను అని కియారా చెప్పింది.

కబీర్ సింగ్ రీమేక్‌లో

కబీర్ సింగ్ రీమేక్‌లో

కియారా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన కళంక్ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ ఆమె వేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తుండగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇంకా కాంచన రీమేక్, గుడ్ న్యూస్ అనే చిత్రాల్లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X