తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణమిదే.. క్లారిటీ ఇచ్చిన మహేష్ బ్యూటీ
టాలీవుడ్ లో సినిమా చేయడానికి బాలీవుడ్ బ్యూటీలు కూడా ఈ మధ్య తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో తెలుగు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని భామలు ఇప్పుడు ఇక్కడ కూడా బాక్సాఫీస్ మార్కెట్ పెరుగుతుండడంతో ఏ మాత్రం నో చెప్పడం లేదు. అదే తరహాలో భరత్ అనే నేను బ్యూటీ కూడా ఆలోచిస్తోంది. కీయరా అద్వానీ చివరగా వినయ విధేయ రామ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మరో తెలుగు సినిమాను చేయలేదు. అమ్మడికి ఆఫర్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ యాక్సెప్ట్ చేయలేదు. దీంతో అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుతుందనే సందేహాలపై అనేక రూమర్లు పూట్టుకొస్తున్నాయి. ఇటీవల అమ్మడిపై నెగిటివ్ రూమర్స్ రావడంతో స్పందించక తప్పలేదు. కావాలని నేను తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తున్నాను అని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం నేను బాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ఆఫర్స్ వస్తున్న మాట నిజమే గాని మంచి సినిమాలతో అక్కడి ఆడియెన్స్ ని మెప్పించాలని సరైన సబ్జెక్టు కోసం వెతుకున్నా అని కీయరా వివరణ ఇచ్చింది. రెమ్యునరేషన్ తక్కువ ఇస్తే చేయనని నేను అనలేదని కూడా ఆమె తెలిపింది. ఇక నెక్స్ట్ అమ్మడు మహేష్ - పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే మే నెల ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











