బాయ్‌ఫ్రెండ్‌తో మరోసారి అంటూ... కియారా అద్వానీ రిక్వెస్ట్
బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా కియారా అద్వానీ దుమ్మురేపుతున్నది. గత కొద్దికాలంగా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై వారిద్దరు పెద్దగా స్పందించలేదు. అయితే కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి షేర్షా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మంగళవారం పూర్తి అయింది. ఈ సందర్భంగా కియారా సోషల్ మీడియాలో సిద్దార్థ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. సిద్ధార్థ్ నా బాయ్ ఫ్రెండ్ అని రూమర్ ఉంది. కానీ నాకు మాత్రం మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంటుంది. మళ్లీ సిద్ధార్థ్‌తో కలిసి పనిచేయాలని ఉంది అని కియారా షేర్ చేశారు.
కియారా పోస్టుపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. రూమర్లు మోసపుచ్చడానికి అవకాశం ఉంది. కానీ నీ ముఖంపై నవ్వుపై చంపేసాలా ఉంది. నీతో మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని సిద్ధార్థ్ మల్హోత్రా ట్వీట్ చేశాడు.

కార్గిల్ యుద్ద వీరుడి వాస్తవ కథ ఆధారంగా షేర్షా తెరకెక్కుతున్నది. 1999లో కార్గిల్ వార్‌లో మరణించిన విక్రమ్ బాత్రా జీవితంలోని కీలక ఘట్టాలను తీసుకొని సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని విష్ణు వర్ధన్, కరణ్ జోహర్, హీరూ జోహర్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా తదితరులు నిర్మిస్తున్నారు.
కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. షేర్షా సినిమాతోపాటు గుడ్ న్యూస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్షయ్ కపూర్‌తో కలిసి నటిస్తున్నది. అలాగే కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌లో హీరోయిన్‌గా అక్షయ్ కుమార్‌తో జతకట్టింది.


Click it and Unblock the Notifications











