War 2లో హాట్ టాపిక్‌గా కియారా అద్వానీ డ్రెస్.. ఆ సాంగ్‌లో డ్రెస్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 హవా
హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబో కావడంతో పాటు టీజర్, ట్రైలర్లు వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్స్‌లో మంచి బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. రిలీజ్‌కు 6 రోజులు ఉండగానే అక్కడ వార్ 2కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3,08,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో 2.70 కోట్లు) కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్ నాటికి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. తొలి రోజే వార్ 2 చిత్రం యూఎస్‌లో 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్స్‌లో కనిపించని కియారా
రిలీజ్‌కు వారం రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. నార్త్, సౌత్‌లోని ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది. అలాగే విజయవాడలో భారీ ఎత్తున వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కడా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
కియారాపై ట్రోలింగ్
వార్ 2కు సంబంధించి మేకర్స్ రెండు ట్రైలర్లు విడుదల చేయగా.. వీటిలో కియారా బికినీ ఫోటోలు మాత్రమే కనిపించాయి. అది కూడా కొద్ది సెకన్లు మాత్రమే. దీనిపై విపరీతంగా ట్రోలింగ్ సైతం జరిగింది. అయితే ఇటీవలే కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాపను చూసుకుంటూ గడిపేస్తున్నారు కియారా. ఏదో ఒక ప్రమోషనల్ ఈవెంట్‌కు కియారా హాజరవుతారని భావిస్తున్నారు.
హాట్ టాపిక్‌గా కియారా డ్రెస్
ఇదిలాఉండగా.. కియారా అద్వానీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్ 2లోని ఆవాన్ జావాన్ అనే రొమాంటింగ్ సాంగ్‌లో హృతిక్ రోషన్‌తో కియారా కెమెస్ట్రీ అదిరిపోయింది. ఇటలీలోని అందమైన లోకేషన్లకు, కియారా అందం, ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ కలిసి ఈ పాటను గ్రాండీయర్‌గా మార్చేసింది. ఇక ఫ్యాషన్ విషయంలో ముందుండే కియారా అద్వానీ .. వార్ 2 కోసం ధరించిన డ్రెస్సులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఆవాన్ జావాన్ పాట కోసం ధరించిన యెల్లో కలర్ మజోలిక ప్రింట్ ఆఫ్ షోల్డర్ టాప్‌లో కియారా మెరిసిపోయారు. ఈ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ డ్రెస్ పేరెంటీ? దీని ధర ఎంత? అనే వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ను శోధిస్తున్నారు. ఈ డ్రెస్‌ను డోల్స్ అండ్ గబ్బానా కంపెనీ డిజైన్ చేయగా దీని ధర అక్షరాల 1,55,200 రూపాయలని తేలింది. దాంతో అభిమానులు ఆ డ్రెస్ కోసం ఎగబడుతున్నారు.


Click it and Unblock the Notifications











