ఫేస్ సర్జరీ చేసుకుందా? హీరోయిన్ కియారా అద్వానీ షాకింగ్ లుక్!
Recommended Video

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ కియారా అద్వానీ అందం పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో సెక్స్ సీన్లతో మీడియాలో హాట్ టాపిక్ అయిన కియారా తాజాగా మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. ఆమె తన ముఖానికి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని, సర్జరీ తర్వాత ఆమె మొహాన్ని చూడలేక పోతున్నామంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఫ్యాషన్ షోలో ఆమె లుక్ చూసి షాక్
ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో కియారా అద్వానీ.... బ్లాక్ లేస్ జంప్ సూట్‌తో దర్శనమిచ్చింది. ఆమె వేసుకున్న డ్రెస్సు బాగానే ఉంది కానీ... ఆమె ఫేసులో మార్పులు చూసి అందరూ షాకయ్యారు.

కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందా?
కియారా ఫేసులో బుగ్గలు (చీక్స్) చూసిన అభిమానులు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ తర్వాత ఆమె ఫేసు చూడలేక పోతున్నామని, ఆమె లుక్ చాలా టెర్రిబుల్‌గా ఉందనే కామెంట్స్ చేశారు.

అప్పుడే నువ్వు అందంగా ఉన్నావు
ఇపుడు నీ లుక్ చాలా చెత్తగా ఉంది... అంతకు ముందే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇలాంటి చెత్త సర్జరీలు చేసుకుని నీ అందాన్ని పాడు చేసుకున్నావు... అంటూ కొందరుే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయేషా టకియా పార్ట్ 2
మరొక వ్యక్తి ఇంకో అడుగు ముందుకేసి... ఆయేషా టకియా పార్ట్ 2 అంటూ వ్యాఖ్యలు చేశారు. సర్జరీ తర్వాత నువ్వు దెయ్యంలా తయారయ్యావని, నువ్వు చేయించుకున్న ఫేస్ సర్జరీ వికటించిందని మాకు అర్థమైంది అంటూ విమర్శలు చేశారు.

కియారా స్పందన
ఈ కామెంట్లపై కియారా స్పందించారు. తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, అసలు విషయం తెలుసుకోకుండా కామెంట్స్ చేయవద్దు. బిర్యానీ తినడం వల్లనే తన ఫేసులో మార్పులు వచ్చాయని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











