మళ్లీ గ్లామర్ డోస్ పెంచిన గేమ్ చేంజర్ హీరోయిన్.. పెళ్లయినా అలా చూపిస్తే ఎలా!
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నార్త్ సుందరాంగుల్లో కియారా అద్వానీ ఒకరు. అప్పట్లో మహేశ్ బాబు, రామ్ చరణ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. చాలా కాలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ ద్వారా జోడి కట్టనుంది. అలాగే మరోవైపు హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజిగా ఉంటోంది. సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటే ఈ గ్లామర్ పిల్ల తాజాగా స్టన్ అయ్యేలా ఫొటోలు షేర్ చేసింది. అవి ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి.
మొదట సినిమాతోనే:తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో హిందీ భామ కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, చందం, అభినయంతో అలరించింది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది.

పరువాల ప్రదర్శన:బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోస్తూ పరువాల ప్రదర్శన చేసింది. అయితే కుటుంబ నేపథ్యం, యాక్షన్ అండ్ సెంటిమెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం అంతగా విజయం సాధించలేదు.
వరుస హిట్స్:చెర్రీతో ముద్దుగుమ్మ కియారా అద్వానీ చేసిన సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో తిరిగి మళ్లీ బాలీవుడ్ కి మకాం మార్చింది అందాల సుందరి కియారా అద్వానీ. అక్కడ వరుసగా చేసిన సినిమాలు మంచి హిట్లు కొట్టాయి. కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

టాక్ రాని మూవీ:కియారా అద్వాని చేసిన హిందీ చిత్రాలన్ని దాదాపుగా విజయం సాధించడంతో ఆమె లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అలాగే ఆమె అందచందాలకు నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో కియారాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. గతేడాది గోవిందా నామ్ మేరా అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది బ్యూటిఫుల్ కియారా అద్వాని. ఈ సినిమాకు పెద్దగా టాక్ అయితే రాలేదు.

హీరోతో పెళ్లి:ఓటీటీ కాకుండా ఇటీవలే సత్య ప్రేమ్ కి కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కియారా అద్వానీ. దీనికి మంచి టాక్ తోపాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ రామ్ చరణ్ సరసనే నటిస్తోంది కియారా. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోంది. కాగా బాలీవుడ్ హీరో, బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
గ్లామర్ డోస్ పెంచి:సోషల్ మీడియాలో నిత్యం ఘాటు ఫొటోలతో దర్శనం ఇచ్చే ముద్దుగుమ్మ కియారా అద్వానీ పెళ్లయిన తర్వాత కూడా బీభత్సమైన గ్లామర్ షో చేస్తూ డోస్ పెంచేస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్సులో పరువాలను టైట్ గా చూపించింది. అలాగే మత్తెక్కే చూపులతో కవ్విస్తూ దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











