#7YearsOfKiaraadvani : త్వరలో ఎగ్జైటింగ్ న్యూస్ అంటూ హింట్.. ఆ సినిమానేనా?

ముంబైకి చెందిన కియారా అద్వానీ సినిమాల మీద ఆసక్తితో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ముందుగా దర్శకుడు, నటుడు కబీర్ సదానంద్ తెరకెక్కించిన కామెడీ డ్రామా ఫగ్లీలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి సరిగ్గా ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఫగ్లీతో ఎంట్రీ

ఫగ్లీతో ఎంట్రీ

ఫగ్లీ అనే సినిమా ద్వారా కియారా అద్వానీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొహిత్ మర్వా, విజేందర్ సింగ్, అర్ఫి లాంబా, జిమ్మీ షెర్గిల్‌ల సరసన ఆమె నటించింది. వసూళ్లు బాగానే వచ్చినా ఆమెకు మాత్రం పెద్దగా అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. అయితే ఆ తరువాత ఆమె చేసిన ఎంఎస్ ధోని సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మెషిన్ అనే సినిమాలో నటించిన పెద్దగా పేరు అయితే రాలేదు.

వసుమతితో మాయ

వసుమతితో మాయ

కానీ ఈ భామ 2018లో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వసుమతి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్ అవకాశం కూడా దక్కింది. అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగునాట అవకాశాలు పెద్దగా దక్కలేదు.

బాలీవుడ్ లో బిజీ

బాలీవుడ్ లో బిజీ

తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఆమె ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో షేర్షా అనే సినిమా పూర్తి కాగా భూల్ భూలయ్యా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లే లే అనే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే ఈ భామ తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అంశం మీద కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చింది.

ఆ సినిమాల్లో

ఆ సినిమాల్లో

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జోరుగా జరగగా ఆ సినిమానే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో కొరటాల శివ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్గా ఎంపికైంది అనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో కూడా ఈ భామ హీరోయిన్ ఎంపిక అయింది అని ప్రచారం జరిగింది.

ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్

ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్

ఈరోజు ఆమె సినిమా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఒక ఫ్యాన్ ఆమెకు ట్వీట్ చేసింది. మీకోసం సౌత్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోందని వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చే సినిమాలు చేయాలని ఆమె కోరింది.

దానికి ఆనంద పడిపోయిన కియారా అద్వానీ లవ్ యూ ఆల్ అని పేర్కొనడమే కాక త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ తో మీముందుకు వస్తానని చెబుతూ ట్వీట్ చేసింది. దీంతో ఈ సినిమాల్లో ఏ సినిమాలో ఆమె నటించబోతోంది అనే అంశం మీద ఇపుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X