twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కియారా అద్వానీకి క్రేజీ ఆఫర్.. కబీర్ సింగ్ తర్వాత మరో యువ హీరోతో రొమాన్స్

    |

    సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన భూల్ భులయ్యా రీమేక్‌కు రంగం సిద్ధమైంది. చంద్రముఖి మూవీకి రీమేక్‌గా 2005లో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా భూల్ భులయ్యా 2 మూవీ రూపొందుతున్నది. అక్షయ్ కుమార్ స్థానంలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ నటించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. వివరాల్లోకి వెళితే..

    కార్తీక్ ఆర్యన్‌తో

    కార్తీక్ ఆర్యన్‌తో

    భూల్ భులయ్యా చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ జంటగా రూపొందింది. ప్రస్తుతం వారి స్థానంలో కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ జంటగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనిస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనీస్ మాట్లాడుతూ.. నిర్మాత భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీతో కలిసి సినిమాను రూపొందించడం ఆనందంగా ఉంది. టాలెంటెడ్ యాక్టర్ కార్తీక్‌తో కలిసి ఈ ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉంది అని అన్నారు.

     భూల్ భులయ్యా ఆఫర్‌తో

    భూల్ భులయ్యా ఆఫర్‌తో

    ఇక ఇటీవల కాలంలో హాట్ హీరోయిన్‌గా ఆకట్టుకొంటున్న కియారా అద్వానీ హీరోయిన్‌ను సినిమాకు ఎంపిక చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భూల్ భులయ్యా 2 చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్తున్నది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్‌కు ముందు స్క్రిప్టు రిహార్సల్ జరుగుతాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

    కబీర్ సింగ్ తర్వాత

    కబీర్ సింగ్ తర్వాత

    ఇక కియారా అద్వానీ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నది. కబీర్ సింగ్ సక్సెస్‌తో కియారా అద్వానీ హాట్ ఫేవరేట్‌గా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తోనే రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. అక్షయ్ నటిస్తున్న గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నది. అలాగే షేర్షా, ఇందూ కి జవానీ అనే చిత్రంలో నటిస్తున్నది.

    అక్షయ్ ఫ్యాన్‌ను నేను

    అక్షయ్ ఫ్యాన్‌ను నేను

    ఆర్యన్ కార్తీక్ మాట్లాడుతూ.. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన భూల్ భులయ్యా చిత్రం నాకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో ఒకటి. అలాంటి సినిమాకు రీమేక్‌గా వస్తున్న చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్‌కు నేను బిగ్ ఫ్యాన్‌ను. అలాంటి నా ఫేవరేట్ హీరో నటించిన సినిమాకు కొనసాగింపు చిత్రంలో ఆఫర్ రావడం హ్యాపీ. అని అన్నారు.

    English summary
    Young actress Kiara Advani most demanded star in Bollywood after Kabir Singh Hit. Reports suggest that She has been roped for Bhool Bhulaiyaa 2 project. She is pairing with Karthik Aryan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X