చంద్రముఖి 2 అప్డేట్: ఆ క్యూట్ బ్యూటీ జ్యోతిక పాత్రకు న్యాయం చేయగలదా?

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన చంద్రముఖి సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా పట్టాలెక్కనుంది. అయితే ఈ సారి రజినీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్ దెయ్యాన్ని కంట్రోల్ చేయబోతున్నాడట.

ముని కాంచన సీక్వెల్స్ అంటూ హారర్ కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ లో ఎలా కనిపిస్తాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక మొదట ఈ సీక్వెల్ ని లారెన్స్ డైరెక్ట్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఒరిజినల్ దర్శకుడు పి.వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

Kiara advani key role in chandramukhi sequel

అయితే చంద్రముఖి అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చేది జ్యోతిక. ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించి దాదాపు సూపర్ స్టార్ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. ఆ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు సీక్వెల్ లో చంద్రముఖిగా గ్లామర్ బ్యూటీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Kiara advani key role in chandramukhi sequel

మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీయరా అద్వానీ చంద్రముఖి సీక్వెల్ లో దెయ్యంగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లారెన్స్ దర్శకత్వంలో అమ్మడు లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లారెన్స్ తో కలిసి నటించడానికి సిద్ధమవుతోంది. మరి ఆ పాత్రకు ఈ క్యూట్ గర్ల్ ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X