Don't Miss!
- News
Bengaluru: అర్దరాత్రి జంటతో ఆడుకున్న గస్తీ పోలీసులు, గూగుల్ పే దెబ్బతో గూబ గుయ్ మనింది !
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Finance
adani: అదానీకి కొత్త సమస్య.. దాని ధర తగ్గించాలని పట్టుబడుతున్న బంగ్లాదేశ్
- Sports
Ranji Trophy 2023: ముగిసిన ఆంధ్ర పోరాటం.. క్వార్టర్స్‌లో తప్పని ఓటమి!
- Lifestyle
గర్భిణీ స్త్రీలు నిద్రలేమితో బాధపడటానికి కారణాలు ఏమిటో తెలుసా?
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బ్లాక్ డ్రెస్ లో కియారా అద్వాని రచ్చ: ఎన్నడూ చూపించిన విధంగా హాట్ షో!
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడిగా భరత్ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా అనిపించుకుంటుంది. ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు దాదాపుగా మంచి విజయం సాధించాయి. సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫొటోషూట్లతో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ ను కియారా అద్వానీ పోస్ట్ చేసింది.

క్రేజ్ సంపాదించుకున్న హిందీ హీరోయిన్స్..
తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రేమించే ఓ సాధారణ యువతిగా అలరించింది.

చరణ్ మూవీ ప్లాఫ్ తో..
బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమా తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసింది ఈ బ్యూటి. అయితే కుటుంబ నేపథ్యం, యాక్షన్ అండ్ సెంటిమెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం అంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా ప్లాప్ తో తెలుగులో కియారాకు అవకాశాలు తగ్గాయి.

దాదాపుగా అన్ని చిత్రాలు..
తెలుగులో సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో మళ్లీ తిరికి బాలీవుడ్ కి మకాం మార్చింది అందాల హిందీ భామ కియారా అద్వానీ. అక్కడ వరుసగా హిందీ సినిమాలు చేసింది కియారా. వాటిలో కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో దాదాపుగా అన్ని చిత్రాలు విజయం సాధించడంతోపాటు కియారా గ్లామర్ కి నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

విక్కీ కౌశల్ తో త్వరలో..
ప్రస్తుతం గోవిందా నామ్ మేరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది బ్యూటిఫుల్ కియారా అద్వాని. ఇందులో విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది కియారా. సినిమాలో పెళ్లయిన విక్కీ కౌశల్ కు మోడ్రన్ గర్ల్ ఫ్రెండ్ గా కియారా నటించనుంది. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి డిసెంబర్ 16న రానుంది. ఇదిలా ఉంటే చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ రామ్ చరణ్ సరసనే ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది కియారా.

హాట్ ఫొటోలతో..
రామ్ చరణ్ RC15 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్లో కియా రా అద్వానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్, హాట్ ఫొటోలతో యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంది కియారా అద్వానీ.

మత్తెక్కించేలా చూస్తూ..
కియారా అద్వానీ సోషల్ మీడియాలో విభిన్నమైన ఫొటోషూట్లతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోక ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది కియారా. బ్లాక్ డ్రెస్ వేసుకున్న కియారా అద్వానీ తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ఆరబోసింది. ఎద అందాలతో పాటు ఘాటుగా థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది ఈ భామ. హాట్ పోజులతో మత్తెక్కించేలా చూస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

అసలు పేరు అలియా..
కియారా అద్వానీ తాజాగా బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫలితంగా నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కాగా కియారా అద్వానీ 2014లో వచ్చిన ఫగ్లీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. అయితే కియారా అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ ఉండటంతో తన పేరును కియారాగా మార్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.