Kiara Advani: హద్దు దాటిన కియరా అద్వానీ హాట్ షో.. టాప్ యాంగిల్ లో అందాలతో ఎర
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన బాలీవుడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్గా నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో దూసుకుపోతూ బాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా అనిపించుకుంటుంది ఈ బ్యూటి. ఎందుకంటే ఆమె నటించిన అన్ని హిందీ చిత్రాలు ఆల్మోస్ట్ మంచి సక్సెస్ సాధించాయి. సినిమాలే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫొటోషూట్‌తో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా కియారా అద్వానీ పెట్టిన ఫొటోలను చూసి క్యా కియారే.. అంటూన్నారు నెటిజన్లు.

రామ్ చరణ్ కు జోడిగా
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ అంతగా సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. మళ్లీ తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మకాం మార్చింది ఈ హిందీ భామ.

నటనకు ప్రాధాన్యత గల పాత్రలో..
చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ రామ్ చరణ్ సరసనే ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్లో కియా రా అద్వానీ నటిస్తున్నట్లు సమాచారం. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

టాప్ యాంగిల్ లో..
అప్పుడప్పుడు గ్లామర్, హాట్ ఫొటోలతో యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంది కియారా అద్వానీ. విభిన్నమైన ఫొటోషూట్లతో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోక ఫొటోషూట్‌తో ఆకట్టుకుంది కియారా. స్టైలిష్ వేర్లో దర్శనమిచ్చిన కియరా అద్వానీ తన క్లీవేజ్ బ్యూటిని హాట్ గా ప్రదర్శించింది. టాప్ యాంగిల్ లో ఫొటోలకు పోజులిచ్చిన ఈ సుందరి పిక్స్ యూత్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.

డిఫరెంట్ పోజులతో..
బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ దుస్తుల్లో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ విభిన్నమైన పోజులతో అట్రాక్ట్ చేసింది. చేతిలో బ్యాగ్ తో గోడకు నిల్చుని, బెడ్ పై, నేలపై కూర్చోని చాలా ఘాటుగా యూత్ ను తనవైపుకు తిప్పుకుంటోంది. ప్రస్తుతం కియరా అద్వానీ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్ కియారా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు సినిమాలే కాకుండా అటు హాట్ పిక్స్ తో కూడా కియరా హైలెట్ అవుతోంది.

అసలు పేరు అలియా..
కాగా కియారా అద్వానీ సినీ కెరీర్ విషయానికొస్తే 2014లో వచ్చిన ఫగ్లీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. అయితే కియారా అసలు పేరు అలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ ఉండటంతో తన పేరును కియారాగా మార్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌గా వచ్చిన ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

లస్ట్ స్టోరిస్ వెబ్ సిరీస్ తో..
అయితే ఈ భామ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ చేసిన అంతాలజీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ చేసింది. ఈ సిరీస్‌లో తన యాక్టింగ్‌కు చాలా ప్రశంసులు దక్కాయి. ఓ గృహిణిగా ఉంటూనే బోల్డ్నెస్ యాక్టింగ్‌కు బాలీవుడ్ ఫిదా అయింది. ఈ సిరీస్‌లో కియారా అద్వానికి జోడిగా విక్కీ కౌశల్ నటించాడు. ఇప్పుడు మళ్లీ విక్కీ కౌశల్ తో కలిసి గోవిందా నామ్ మేరా సినిమాలో జోడి కట్టింది ఈ భామ. ఇందులో మరో హీరోయిన్ గా భూమి పడ్నేకర్ నటించింది.

రూ. 200 కోట్ల గ్రాస్..
ఇదిలా ఉంటే హిందీలో అర్జున్ రెడ్డికి రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్ సినిమాతో మరింత ఆకట్టుకుంది కియారా అద్వానీ. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల భూల్ భులయ్యా 2 చిత్రంతో మంచి హిట్ కొట్టింది. సుమారు రూ. 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











